శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : సోమవారం, 14 ఆగస్టు 2017 (18:16 IST)

20 ఏళ్ల యువతిని అర్థనగ్నంగా నాలుగో అంతస్థు నుంచి విసిరేశారు...

నిర్భయ లాంటి ఘటనలు జరిగినా దేశ రాజధాని నగరం ఢిల్లీలోనే కాదు.. దేశవ్యాప్తంగా మహిళలపై అకృత్యాలు ఆగట్లేదు. కఠినమైన చట్టాలు రావట్లేదు. తాజాగా ఢిల్లీలోని శివారు ప్రాంతం రోహిణి ప్రాంతంలోని ఓ భవనంలో ఘోరం జరి

నిర్భయ లాంటి ఘటనలు జరిగినా దేశ రాజధాని నగరం ఢిల్లీలోనే కాదు.. దేశవ్యాప్తంగా మహిళలపై అకృత్యాలు ఆగట్లేదు. కఠినమైన చట్టాలు రావట్లేదు. తాజాగా ఢిల్లీలోని శివారు ప్రాంతం రోహిణి ప్రాంతంలోని ఓ భవనంలో ఘోరం జరిగింది. 20 ఏళ్ల యువతి అర్ధనగ్నంగా ఆ భవనం నుంచి విసిరివేయబడింది.

నాలుగో అంతస్తు నుంచి విసిరివేయబడిన ఆ యువతి తలకు తీవ్రంగా గాయం తగలడంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా వుందని వైద్యులు చెప్తున్నారు. 
 
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. బాధిత యువతిపై అతని ప్రేమికుడు దీపక్ అత్యాచారానికి పాల్పడి.. నాలుగో అంతస్తు నుంచి విసిరేశాడని తెలుస్తోంది. అతడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణను ముమ్మరం చేశారు. ఈ ఘటనలో దీపక్‌కు మాత్రమే కాకుండా మరో నలుగురి ప్రమేయం కూడా ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.