ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 24 మే 2017 (08:55 IST)

984 అడుగుల లోతులోవున్న భాగీరథి నదిలో బోల్తాపడిన బస్సు ... 21 మంది జలసమాధి

ఉత్తరాఖండ్ రాష్ట్రంలో విషాదం చోటుచేసుకుంది. 984 అడుగుల లోతున ప్రవహిస్తున్న భాగీరథి నదిలోకి ఓ బస్సు అదుపుతప్పి బోల్తాపడింది. దీంతో బస్సులో ఉన్న ప్రయాణికుల్లో 21 మంది జలసమాధి కాగా, మరో 9 మంది గల్లంతయ్యా

ఉత్తరాఖండ్ రాష్ట్రంలో విషాదం చోటుచేసుకుంది. 984 అడుగుల లోతున ప్రవహిస్తున్న భాగీరథి నదిలోకి ఓ బస్సు అదుపుతప్పి బోల్తాపడింది. దీంతో బస్సులో ఉన్న ప్రయాణికుల్లో 21 మంది జలసమాధి కాగా, మరో 9 మంది గల్లంతయ్యారు. మంగళవారం సాయంత్రం ఈ విషాదం జరిగింది. 
 
దేవభూమిగా ప్రసిద్ధికెక్కి ఉత్తరాఖండ్‌లో రాష్ట్రంలో గంగోత్రి నుంచి హరిద్వార్‌కు వెళ్తున్న మినీ బస్సు నా లూపానీ వద్ద.. 984 అడుగుల లోతున ప్రవహిస్తున్న భాగీరథి నదిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 21 మంది మరణించగా.. 9 మంది గల్లంతయ్యారు. 
 
ప్రమాద వార్త గురించి తెలుసుకున్న ఇండో-టిబెటన్‌ సరిహద్దు భద్రతా బలగాలు, జాతీయ విపత్తు సహాయక దళాలు రంగంలోకి దిగి 20 మృతదేహాలను వెలికితీశారు. మరొకరు ఆస్పత్రిలో మరణించారు. కాగా, బస్సులో ఉన్నవారిలో అత్యధికులు ఇండోర్‌వాసులే. వీరంతా చార్‌ధామ్ యాత్రకు వచ్చి మృత్యుఒడిలోకి చేరుకున్నారు. 
 
గత నెల 28న చార్‌ధామ్‌ యాత్ర ఆరంభం కాగా.. ఇప్పటివరకు 7.10 లక్షల మంది ఆలయాలను సందర్శించారు. కాగా, మధ్యప్రదేశ్‌ సీఎం మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల పరిహారం ప్రకటించారు.