శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 24 ఆగస్టు 2020 (12:03 IST)

చంపారన్ జిల్లాలో ఘోరం.. యువకుడు హత్య.. ముక్కలు ముక్కలుగా నరికి..?

బీహార్‌లోని పశ్చిమ చంపారన్ జిల్లాలో ఘోరం జరిగింది. ఓ యువకుడి హత్య కలకలం సృష్టించింది. మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికి తల ఒకచోట, శరీర భాగాలను బస్తాలో వేసి మరోచోట పడేశారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. లాలూనగర్‌కు చెందిన ముహమ్మద్ అబ్దుల్ ఖలీద్ హుస్సేన్ (22) శనివారం రాత్రి మరో వ్యక్తితో కలిసి ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. 
 
ఆదివారం లాలూనగర్‌ శివారులోని ఓ ఖాళీ స్థలంలో తలను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మొండేన్ని ముక్కలు ముక్కలుగా నరికి బస్తాలో మూట కట్టి సమీపంలోని మొక్కజొన్న కర్మాగారం పక్కన పడేశారు. మృతుడి తండ్రి అక్తర్ హుస్సేన్ దుస్తుల ఆధారంగా మృతదేహం తన కుమారుడిదేనని గుర్తించారు. 
 
భూ వివాదం నేపథ్యంలో స్థానిక రాజకీయ నాయకురాలి భర్తే తన కొడుకుని హత్య చేయించాడని హుస్సేన్ ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు.