శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By శ్రీ
Last Modified: మంగళవారం, 18 ఆగస్టు 2020 (16:51 IST)

దారుణం.. కాలనీలో సగం కాలిన శరీర భాగాలు

నల్గొండ పట్టణం శ్రీ నగర్ కాలనీలో దారుణం జరిగింది. పట్టణాన్ని అనుకుని ఉన్న స్మశాన వాటికలో మృతదేహాలను సరిగ్గా ఖననం చేయకపోవడంతో, సగం కాలిన శారీర భాగాలను కుక్కలు పీక్కొచ్చి ఇండ్ల మధ్యలో పడేస్తున్నాయి.
 
ఇళ్ల మధ్యలో సగం కాలిన శరీర భాగాలు పడి ఉండటంతో భయాందోళనకు చెందుతున్నారు కాలనీ వాసులు. వాటి నుంచి భరించలేని దుర్గంధం వస్తుండడంతో ఇబ్బందులకు గురవుతున్నారు. 
స్మశాన వాటికలో మృతదేహాలను కాటికాపర్లు సరిగా కాల్చక పోవడం మూలంగా
 ఈ పరిస్థితి నెలకొని ఉందన్నారు స్థానికులు.
 
అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదంటున్నారు కాలనీ వాసులు. దీంతో సగం కాలిన శరీర భాగాలను గుర్తించి తీసుకెళ్ళి స్మశాన వాటికలో అంత్యక్రియలు జరిపారు కొందరు స్థానిక యువకులు.