మలద్వారం ద్వారా బంగారం స్మగ్లింగ్... ఎలా?
బంగారం అక్రమ రవాణాకు స్మగ్లర్లు కొత్తకొత్త దారులు వెతుకుతున్నారు. ఇందులోభాగంగా, ముగ్గురు వ్యక్తులు 1.25 కేజీల బంగారాన్ని మలద్వారంలో పెట్టుకుని అక్రమ రవాణా చేస్తూ ఎయిర్‌పోర్టు అధికారులకు చిక్కారు. తిరుచ్చి విమానాశ్రయంలో వెలుగు చూసిన ఈ వివరాలను పరిశీలిస్తే,
కౌలాలంపూర్ నుంచి తిరుచ్చికి ఎయిర్ ఇండియా విమానం ఒకటి వచ్చింది. ఈ విమానంలో కొందరు ప్రయాణికులు స్మగ్లింగ్ చేస్తున్నట్టు ఎయిర్‌పోర్టు అధికారులకు ముందుగానే సమాచారం అందింది. దీంతో విమానం తిరుచ్చికి చేరుకోగానే, ప్రయాణికులందరినీ క్షుణ్ణంగా తనిఖీ చేశారు.
అత్యాధునిక స్కానింగ్ పరికరాలు ఏ ఒక్కరివద్ద బంగారం ఉన్నట్టు గుర్తించలేక పోయాయి. అయితే, ముగ్గురు ప్రయాణికుల తీరు అనుమానాస్పదంగా ఉండటంతో వారిని మరో గదిలోకి తీసుకెళ్లి విచారించారు. ఈ విచారణలో నిజం వెల్లడించారు.
మలద్వారం, అరికాలికి రసాయన పదార్థాలతో అంటించి బంగారం స్మగ్లింగ్ చేస్తున్నట్టు వెల్లడించారు. వీరి నుంచి 1.25 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ప్రయాణికులను రియాజ్ అహ్మద్, తమీమ్ అన్సారీ, జకీర్ హుస్సేన్‌లుగా గుర్తించారు. వీరిపై కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.