బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : ఆదివారం, 28 అక్టోబరు 2018 (09:59 IST)

గంజాయి స్మగ్లింగ్ కేసులో జూనియర్ ఆర్టిస్ట్ అరెస్టు

గంజాయి స్మగ్లింగ్ కేసులో బుల్లితెర జూనియర్ ఆర్టిస్ట్‌ రెడ్డివేద సాయికుమార్ (23)ను పోలీసులు అరెస్టు చేశారు. బాగ్ అంబర్‌పేటకు చెందిన సాయికుమార్ తెలుగు సీరియళ్లలో జూనియర్ ఆర్టిస్ట్‌గా నటిస్తున్నాడు. 
 
విశాఖపట్టణంలోని అరుకు కేంద్రంగా మణి, అభిషేక్ అనే ఇద్దరు స్మగ్లర్ల సాయంతో గంజాయిని దిగుమతి చేసుకుంటున్న సాయికుమార్ వాటిని నగరంలోని పలు ప్రాంతాల్లో విద్యార్థులు, స్నేహితులకు సరఫరా చేస్తున్నాడు. 
 
శనివారం బాగ్ అంబర్‌పేటలో ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో సాయికుమార్ గంజాయితో పట్టుబడ్డాడు. అతడి నుంచి పెద్దమొత్తంలో గంజాయిని స్వాధీనం చేసుకున్న అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.