శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 15 మే 2018 (10:40 IST)

#KarnatakaVerdict : ఓటమి దిశగా నటుడు సాయికుమార్

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ విజయం దిశగా దూసుకెళుతోంది. అయితే, ఆ పార్టీ తరపున బరిలోకి దిగిన సినీ నటుడు సాయికుమార్ మాత్రం ఓటమి దిశగా సాగుతున్నారు. ఈయన బాగేపల్లి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ విజయం దిశగా దూసుకెళుతోంది. అయితే, ఆ పార్టీ తరపున బరిలోకి దిగిన సినీ నటుడు సాయికుమార్ మాత్రం ఓటమి దిశగా సాగుతున్నారు. ఈయన బాగేపల్లి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసిన విషయం తెల్సిందే.
 
మరోవైపు, బాదామిలో బీజేపీ అభ్యర్థి బీ శ్రీరాములు, చిత్తాపూర్ లో కాంగ్రెస్ అభ్యర్థి ప్రియాంక్ ఖర్గే, బళ్లారిలో కాంగ్రెస్ అభ్యర్థి అనిల్ హెచ్ లాడ్, సోరబ్ లో బీజేపీ అభ్యర్థి కుమార బంగారప్ప తదితరులు వెనుకంజలో ఉన్నారు. 
 
ఇదేసమయంలో హరప్పనహళ్లిలో బీజేపీ అభ్యర్థి జీ కరుణాకర్ రెడ్డి, షిమోగాలో బీజేపీ అభ్యర్థి కేఎస్ ఈశ్వరప్ప, మొలకలమూరులో బీజేపీ అభ్యర్థి శ్రీరాములు, హలియాల్‌లో కాంగ్రెస్ అభ్యర్థి ఆర్వీ దేశ్ పాండే, హుబ్లీ-ధార్వాడ్ సెంట్రల్ లో బీజేపీ అభ్యర్థి జగదీష్ షెట్టర్, బీదర్ లో కాంగ్రెస్ అభ్యర్థి రహీమ్ ఖాన్ తదితరులు ముందంజలో ఉన్నారు. 
 
ఇదిలావుంటే, మొత్తం 222 స్థానాల్లో ట్రెండ్స్ వెలువడుతుండగా, బీజేపీ 114, కాంగ్రెస్ 64, జేడీఎస్ 43, ఇతరులు ఒక్క చోట ఆధిక్యంలో ఉన్నారు. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు ఇతరుల సహకారం లేకుండానే బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది.