'డైలాగ్ కింగ్'ను ఓడించిన తెలుగు ఓటర్లు.. బళ్ళారిలో బలంగా వీచిన "గాలి"
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన సినీ నటుడు, డైలాగ్ కింగ్ సాయి కుమార్ చిత్తుగా ఓడిపోయారు. ఈ స్థానం నుంచి ఆయన పోటీ చేసి ఓడిపోవడం ఇది రెండోసారి కావడం గమనార్హం. గత 2008లో కూడా సాయ
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన సినీ నటుడు, డైలాగ్ కింగ్ సాయి కుమార్ చిత్తుగా ఓడిపోయారు. ఈ స్థానం నుంచి ఆయన పోటీ చేసి ఓడిపోవడం ఇది రెండోసారి కావడం గమనార్హం. గత 2008లో కూడా సాయికుమార్ ఇక్కడ నుంచి పోటీ ఓటమిపాలయ్యారు.
తెలుగు ప్రజలు ఎక్కువగా ఉండే ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక సరిహద్దులోని బాగేపల్లి శాసన సభ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా ఆయన పోటి చేశారు. అయితే ఈ డైలాగ్ కింగ్‌కు తెలుగు సెంటిమెంట్ కలిసిరాలేదు. బీజేపీపై ఉన్న కోపం ఆయనపై చూపించారు. దీనికితోడు కాంగ్రెస్ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే సుబ్బారెడ్డి గెలుపును ఆయన అడ్డుకోలేక పోయారు. ఫలితంగా సాయికుమార్ నాలుగో స్థానానికి పరిమితమయ్యాడు.
మరోవైపు, బళ్ళారి రీజియన్‌లో గాలి జనార్ధన్ రెడ్డి హవా ఏమాత్రం తగ్గలేదని మరోమారు నిరూపితమైంది. ఈ ఎన్నికల్లో పోటీ చేసిన ఆయన అనుచరులు విజయం దిశగా దూసుకెళుతున్నారు. బళ్లారిలో గాలి సోమశేఖర రెడ్డి, హరప్పనహళ్లిలో గాలి కరుణాకర్‌రెడ్డి భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. గాలి బద్రర్స్ ప్రధాన అనుచరుడు శ్రీరాములు మొలుకాల్మూరు నియోజకవర్గం నుంచి విజయం సాధించాడు. మరో స్థానం బాదామిలో మాత్రం సిద్దరామయ్య చేతిలో ఓటమి పాలయ్యారు. గాలి బ్రదర్స్ మరో ప్రధాన అనుచరుడు ఫకీరప్ప కూడా విజయం దిశగా దూసుకెళ్తున్నాడు.
కాగా, బళ్లారి రీజియన్‌లో మొత్తం 9 మందికి గాలి బ్రదర్స్ టికెట్లు ఇప్పించుకున్నారు. వీరిలో ఆరుగురు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. బీజేపీ తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు. బళ్లారిలో గాలి జనార్థన్ రెడ్డి తన సత్తాచాటాడు. ఈ ఎన్నికల్లో ఓటు హక్కు కూడా వినియోగించుకోలేకపోయినా గాలి.. తన వారికి మాత్రం గెలిపించుకుని కాంగ్రెస్ పార్టీకి నిద్రలేకుండా చేశారు.