శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 15 మే 2018 (12:31 IST)

#KarnatakaVerdict : సీఎం సిద్ధరామయ్య ఓటమి

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఓటమిపాలయ్యారు. ఈ ఎన్నికల్లో ఆయన రెండు స్థానాల్లో పోటీ చేయగా, అందులో మైసూరు జిల్లాలోని చాముండేశ్వరీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిప

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఓటమిపాలయ్యారు. ఈ ఎన్నికల్లో ఆయన రెండు స్థానాల్లో పోటీ చేయగా, అందులో మైసూరు జిల్లాలోని చాముండేశ్వరీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు.
 
తన సమీప జేడీఎస్ అభ్యర్ధి జీటీ దేవెగౌడ చేతిలో ఆయన పరాజయం పాలయ్యారు. సిద్ధరామయ్య ఏకంగా 18 వేల ఓట్ల తేడాతో ఓటమిపాలవ్వడం కాంగ్రెస్ పార్టీకి పెద్ద షాక్ లాంటింది. అయితే రెండు నియోజకవర్గాల నుంచి సిద్దూ పోటీ చేస్తున్నప్పటికీ.. మరో నియోజకవర్గమైన బాదామిలో మాత్రం సిద్ధరామయ్య బొటాబొటి మెజారిటీతో గెలుపొందే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఇక్కడ కూడా బీజేపీ అభ్యర్థి అయిన శ్రీరాములు గట్టి పోటీ ఇస్తున్నారు.