1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 14 మే 2024 (09:35 IST)

మరణించిన కుమార్తెకు ప్రేతాత్మ వరుడు కావాలెను... తల్లిదండ్రుల ప్రకటన!!

child marriage
ఎపుడో మూడు దశాబ్దాల క్రితం మరణించిన కుమార్తెకు ప్రేతాత్మ వరుడు కావాలంటూ కర్నాటకకు చెందిన తల్లిదండ్రులు ఇచ్చిన ఓ పత్రికా ప్రకటన ఆసక్తికరంగా మారింది. కర్నాటక రాష్ట్రంలోని పుత్తూరు ప్రాంతానికి చెందిన ఓ జంట ఈ తరహా ప్రకటన ఇచ్చింది. ఇందులో కులల్ కులం, బంగే రా గోత్రంలో జన్మించిన వధువుకు తగిన వరుడు కావలెను. వధువు 30 యేళ్ల క్రితం మరణించింది. ఇదే కులం, వేరొక గోత్రంలో జన్మించిన 30 సంవత్సరాల క్రితం మరణించిన వరుడు ఉన్నట్టయితే, ప్రేత మడువే కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఆయన కటుంబ సభ్యులు సమ్మతిస్తే సంప్రదించండి అంటూ అందులో పేర్కొన్నారు. 
 
పైగా, ఇందుకోసం సంప్రదించాల్సిన ఫోన్ నంబరును కూడా వారు ఆ ప్రకటనలో పొందుపరిచారు. ఈ ప్రకటనపై దాదాపు 50 మంది స్పందించారని వధువు కుటుంబానికి చెందిన ఓ వ్యక్తి తెలిపారు. ప్రేత మడువే కార్యక్రమాన్ని నిర్వహించే తేదీని త్వరలోనే నిర్ణయిస్తామన్నారు. దక్షిణ, ఉడిపి జిల్లాల్లోని తులునాడు ప్రాంతంలో మరణించినవారి ఆత్మలకు వివాహం చేసే ఆచారం ఉంది. జీవించి ఉన్నవారికి పెళ్లి చేసినట్టుగానే ఈ కార్యక్రమాన్ని కూడా ఘనంగా నిర్వహిస్తుంటారు.