మంగళవారం, 5 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 8 జులై 2020 (19:12 IST)

తిరువనంతపురంలో కలకలం.. అర్థరాత్రి 300 మందితో పార్టీ.. బెల్లీ డ్యాన్స్‌..

కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో.. పార్టీల గోల మాత్రం తగ్గట్లేదు. కరోనా నియంత్రణకు సర్కారు విధించిన నిబంధనలను అధిగమించి.. 300మంది అర్థరాత్రి ఓ పార్టీకి హాజరయ్యారు. ఈ ఘటన కేరళలోని తిరువనంతపురంలో కలకలం సృష్టించింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఓ ప్రైవేట్ రిసోర్ట్ మేనేజర్‌తో పాటు మరో ఐదుగురిని అరెస్ట్ చేశారు. 
 
వివరాల్లోకి వెళితే.. కేరళలోని హిల్లీ జిల్లాలోని ఉదుంబంచోలలో జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విషయం బయటికి తెలిసిందని పోలీసులు తెలిపారు. జూన్ 29 అర్థరాత్రి ఈ కార్యక్రమం జరిగిందని పోలీసులు తెలిపారు. 
 
కేరళ అంటువ్యాధి చట్టంతో పాటు భారత శిక్షాస్మృతిలోని వివిధ నిబంధనల ప్రకారం జూలై 3న కేసు నమోదైందని తెలిపారు. మేనేజర్‌తో పాటు ఆరుగురిని అరెస్ట్ చేశామని చెప్పారు. ఈ కేసుకు సబంధించి దర్యాప్తు కొనసాగుతోందని ఓ పోలీసు అధికారి చెప్పారు.
 
జూన్ 29 రాత్రి 8 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 2 గంటల వరకు ఈ పార్టీ జరిగిందన్నారు. ఈ పార్టీలో బెల్లీ డ్యాన్స్ వంటివి చోటుచేసుకున్నాయని, ఇందులో డ్యాన్స్ చేసిన డ్యాన్సర్‌ను పక్క  రాష్ట్రం నుంచి రప్పించినట్లు తెలిసింది. మత పెద్దలు, రాజకీయ నాయకులు, సినీ తారలు, ప్రజా ప్రతినిధులు, ఉన్నతస్థాయి అధికారులు పార్టీకి హాజరయ్యారు.