శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 29 జూన్ 2023 (09:16 IST)

జగన్నాథ ఉల్టా రథయాత్రలో విషాదం.. ఆరుగురు చిన్నారులు మృతి

Rath Yatra
త్రిపురలో నిర్వహించిన జగన్నాథ ఉల్టా రథయాత్రలో తీరని విషాదం చోటుచేసుకుంది. రథం హైటెన్షన్ విద్యుత్ తీగలకు తాకడంతో విద్యుదాఘాతం జరిగి ఆరుగురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, ఇద్దరు చిన్నారులు, ఓ పురుషుడు ఉన్నారు.
 
ప్రమాదంలో గాయపడిన వారిని కైలాషహర్‌లోని ఉనకోటి ఆసుపత్రికి తరలించారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనపై ముఖ్యమంత్రి డాక్టర్ మాణిక్ సాహా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు తీవ్ర సంతాపం ప్రకటించారు.