శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 4 ఏప్రియల్ 2020 (17:53 IST)

కరోనా వచ్చినా కామాంధులు ఆగరా? 4ఏళ్ల చిన్నారిపై వృద్ధుడి అత్యాచారం

కరోనా లాంటి ప్రాణాంత వ్యాధులొచ్చినా కామాంధుల బుద్ధి మాత్రం మారట్లేదు. దేశం విపత్కర పరిస్థితుల్లో ఉన్నప్పటికీ అవేమీ పట్టనట్లు మానవ మృగాలు రెచ్చిపోతున్నారు. అభం శుభం తెలియని పసిమొగ్గలను చిదిమేస్తున్నారు. 
 
తాజాగా విశాఖపట్నం జిల్లాలో ఇలాంటి దుర్ఘటన వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. అభం శుభం తెలియని నాలుగేళ్ల చిన్నారిపై 60 ఏళ్ల వృద్ధుడు అత్యాచారానికి పాల్పడిన ఘటన సమాజాన్ని తలదించుకునేలా చేసింది. 
 
వివరాల్లోకి వెళితే.. విశాఖ మన్యం హుకుంపేట మండలం కొట్నాపల్లి పంచాయతీ గొందివలసలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. అదే గ్రామానికి చెందిన గెడ్డంగి కొండబాబు అనే 60 ఏళ్ల వ్యక్తి అతని ఇంటి పక్కనే ఉండే నాలుగేళ్ల చిన్నారిని మిఠాయి కొనిస్తానని నమ్మించి శుక్రవారం బయటకు తీసుకెళ్లాడు.
 
ఎవరూ లేకుండా చూసి ఇంటి వెనుకాలే ఉండే చెట్ల పొదల్లోకి తీసుకెళ్లి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. కూతురు కనిపించకపోవడంతో చుట్టుపక్కల వెతుకుతున్న తల్లికి బాలిక ఏడుపు వినిపించింది. దీంతో ఆమె అటువైపునకు వెళ్లి చూడగా రక్తస్రావంతో కూతురు కనిపించింది. 
 
ఇక వృద్ధుడు చేసిన ఘాతుకాన్ని అర్ధం చేసుకున్న తల్లి ఆగ్రహంతో వృద్ధుడిని చితకబాదింది. కుటుంబ సభ్యులతో పాటు స్థానికులు కూడా కలిసి కామాంధుడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.