బుధవారం, 27 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 2 ఏప్రియల్ 2020 (20:45 IST)

బాబు పేరు 'లాక్‌డౌన్'... పాప పేరు 'కరోనా'... యూపీలో వింతైన పేర్లు (Video)

ప్రస్తతం మనదేశంతో పాటు ప్రపంచం కరోనా వైరస్ గుప్పెట్లో చిక్కుకుంది. ఈ వైరస్ బారినపడి అనేకమంది చనిపోతున్నారు. లక్షలాది మంది ఈ వైరస్ బారినపడుతున్నారు. ఈ వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ ప్రకటించింది. తొలుత మార్చి 22వ తేదీన జనతూ కర్ఫ్యూను అమలు చేశారు. ఆ తర్వాత 21 రోజుల పాటు సంపూర్ణ లాక్‌డౌన్ అమల్లోకి తెచ్చారు. 
 
ఈ క్రమంలో మార్చి 22వ తేదీన పుట్టిన ఓ పాపకు కరోనా అని పేరు పెట్టారు. కరోనా వ్యాప్తిని అరికట్టే చర్యల్లో భాగంగా తొలుత మార్చి 22వ తేదీన జనతా కర్ఫ్యూను అమలు చేశారనీ, దానికి గుర్తుగా తమ కుమార్తెకు కరోనా అని పేరు పెట్టినట్టు తెలిపారు. 
 
మరోవైపు, మార్చి 30వ తేదీన మరో బాబు పుట్టాడు. అంటే దేశం అప్పటికే లాక్‌డౌన్‌లోకి వెళ్లిపోయింది. దీంతో ఆ బాబుకు లాక్‌డౌన్ అని పేరు పెట్టారు. అసలు కరోనా అనే పదం వింటేనే ప్రజలంతా వణికిపోతున్నారు. అలాంటిది, తమ పాపకు కరోనా అని పేరుపెట్టడాన్ని ఆ పాప తల్లిదండ్రులు సమర్థించుకుంటున్నారు. 
 
ఈ రెండు వింత సంఘటనలు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోనే జరిగింది. దియోరియా జిల్లా ఖుకుందు అనే గ్రామంలో పుట్టిన బాలుడికి లాక్‌డౌన్ అని పేరు పెట్టగా, ఇదే రాష్ట్రంలోని గోరఖ్‌పూర్‌లో పుట్టిన పసిబిడ్డకు ఆ బాలిక మేనమాన నితీష్ త్రిపాఠి కరోనా అని నామకరణం చేశాడు. ఇందుకు ఆ బాలిక తల్లిదండ్రుల అనుమతి తీసుకున్నారు. 
 
కరోనా వైరస్ ప్రపంచాన్ని ఐక్యం చేసిందని నితీష్ అంటున్నాడు. ఎన్నో మంచి అలవాట్లు కూడా నేర్పిందని అంటున్నాడు. కరోనా అనే మహమ్మారి మీద పోరాటాన్ని ఈ బాలిక గుర్తు చేస్తుందని తాను భావిస్తున్నట్టు చెప్పుకొచ్చాడు.