శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 10 ఫిబ్రవరి 2021 (12:36 IST)

కేరళలో కలకలం : 192 పాఠశాల విద్యార్థులకు కరోనా

కేరళ రాష్ట్రంలో కరోనా కలకలం ఇంకా తగ్గలేదు. ఆ రాష్ట్రంలో పాజిటివ్ కేసులు ఎక్కువగానే నమోదవుతున్నాయి. ఈ క్రమంలో మళప్పురంలోని ఓ రెండు పాఠ‌శాల‌ల‌కు చెందిన 192 మంది విద్యార్థుల‌కు క‌రోనా పాజిటివ్ నిర్ధార‌ణ అయింది. వీరిలో 91 మంది విద్యార్థులు ఒకే ట్యూష‌న్ సెంట‌ర్‌కు వెళ్తున్న వారిగా గుర్తించిన‌ట్లు జిల్లా విద్యాధికారి ర‌మేశ్ కుమార్‌ తెలిపారు. దీంతో ఆ ట్యూష‌న్ సెంట‌ర్‌తో పాటు పాఠ‌శాలల‌‌ను పోలీసులు మూసివేశారు. 
 
మరోవైపు, కరోనా పాజిటివ్ అని తేలిన విద్యార్థులందరినీ హోం ఐసోలేష‌న్‌లోకు తరలించారు. క‌రోనా పాజిటివ్ నిర్దార‌ణ అయిన వారిలో 149 మంది ఒకే పాఠ‌శాల‌కు చెందిన వారు కాగా, మ‌రో 43 మంది విద్యార్థులు వేరే పాఠ‌శాల‌కు చెందిన‌వారు.
 
అలాగే ఒక పాఠశాలలో 39 మంది టీచ‌ర్ల‌కు, మ‌రో స్కూల్లో 33 మందికి క‌రోనా సోకింది. ఇక‌ ఆ ట్యూష‌న్‌కు వెళ్లే విద్యార్థులంద‌రికీ క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తామ‌ని డాక్ట‌ర్ కే స‌కీనా తెలిపారు. ఇప్ప‌టివ‌ర‌కు ఆ ప‌రిస‌రాల్లో ఉన్న 2 వేల మందితో పాటు టీచ‌ర్లు, విద్యార్థుల‌కు క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు.