ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 16 జనవరి 2020 (06:53 IST)

ఎంత పొడవైన జుట్టో?.. గిన్నీస్ రికార్డుల్లోకెక్కిన యువతి

అరవిల్లి ప్రాంతానికి చెందిన 17 ఏళ్ల నిలాంశి పటేల్ గిన్నీస్ రికార్డుల్లో.. తన రికార్డు తానే తిరగరాసింది. ప్రపంచంలో అతి పొడవైన జుట్టు ఉన్న యువతిగా నిలాంశి రెండోసారి గిన్నీస్ రికార్డు సాధించింది.

2018లో 170.5 సెంటిమీటర్లతో నిలాంశికి గిన్నీస్ రికార్డు వచ్చింది. తాజాగా, 190 సెంటిమీటర్లతో తన రికార్డును తానే తిరిగరాసి మరోసారి గిన్నీస్ రికార్డుల్లోకెక్కింది. తనకు గిన్నీస్ రికార్డు రావడంపై ఆ అమ్మాయి సంతోషం వ్యక్తం చేసింది.

‘‘నేను ఎక్కడికి వెళ్లినా అంతా నాతో సెల్ఫీలు దిగుతుంటారు. ఇదంతా చూస్తుంటే.. నేను ఓ సెలబ్రిటీ అని అనిపిస్తుంది’’ అని నిలాంశి పేర్కొంది.