శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శనివారం, 15 జులై 2017 (10:07 IST)

ఐస్‌క్రీమ్‌లు కొనేందుకు వెళ్ళిన బాలికను పెళ్లాడి.. గర్భవతిని చేశాడు..

బాలికలపై దారుణాలు, మోసాలు పెరిగిపోతున్నాయి. రెండు నెలల క్రితం ఇంటి నుంచి వెళ్ళిపోయిన 13ఏళ్ల బాలిక మూడువారాల గర్భంతో తిరిగి ఇంటికి చేరుకోవడం ఢిల్లీలో కలకలం రేపుతోంది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు 22 ఏళ్ల

బాలికలపై దారుణాలు, మోసాలు పెరిగిపోతున్నాయి. రెండు నెలల క్రితం ఇంటి నుంచి వెళ్ళిపోయిన 13ఏళ్ల బాలిక మూడువారాల గర్భంతో తిరిగి ఇంటికి చేరుకోవడం ఢిల్లీలో కలకలం రేపుతోంది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు 22 ఏళ్ల యువకుడిని అరెస్ట్ చేశారు.

వివరాల్లోకి వెళితే.. మే పదో తేదీన ఐస్‌క్రీములు కొనేందుకు వెళ్ళిన బాలిక ఇంటికి చేరుకోలేదని పోలీసులకు బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. దీంతో పాటు ఓ హోటల్‌లో కుక్‌గా పనిచేస్తున్న ఇద్దు ఖాన్‌పై బాలిక తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేయడంతో అతడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ జరపడంతో అసలు నిజాలు వెలుగులోకి వచ్చాయి. 
 
బాలికను పెళ్లాడిన యువకుడు.. ఆమెను గర్భవతిని చేసినట్లు ఒప్పుకున్నాడు. బాలికను తాను పెళ్ళి చేసుకున్నట్లు యువకుడు తెలిపాడు. అతడిపై బాలిక వివాహ చట్టం కింద మరో కేసు నమోదు చేశారు. కోర్టులో హాజరు పరిచిన అనంతరం అతనిని జైలుకు తరలించారు. అతడి వివాహానికి సాక్షులుగా వ్యవహరించిన మరో ఇద్దరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే బాలిక మాత్రం ఇద్దు ఖాన్‌తోనే ఉంటానని కోర్టులో స్పష్టం చేసింది. తనను తల్లిదండ్రుల వద్దకు పంపించవద్దని అభ్యర్థించింది. ప్రస్తుతం ఆమె చిల్డ్రన్ వెల్ఫేర్ కమిటీ సంరక్షణలో ఉంది.