సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: గురువారం, 11 ఆగస్టు 2022 (23:15 IST)

రోడ్డు దాటుతున్న బాలికను వేగంగా ఢీకొట్టిన మోటార్ బైక్ నడుపుతున్న యువకుడు

Accident
కేరళలోని ఇడుక్కి సమీపంలో ఘోరం చోటుచేసుకుంది. పాఠశాలకు వెళ్తూ రోడ్డు దాటేందుకు ప్రయత్నించిన బాలికను మోటారు బైక్ ఢీకొట్టిన ఘటన కలకలం రేపింది. కేరళలో ఇడుక్కి సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఘటన మొత్తం సీసీటీవీలో రికార్డయ్యింది.

 
కుములి సెయింట్ అలోకా మరియం థామస్ స్కూల్‌లో 5వ తరగతి చదువుతోంది. ఈ రోజు ఆమె రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తూ రోడ్డు దాటేందుకు ప్రయత్నించింది. ఇంతలో వేగంగా వస్తున్న బైక్‌ ఆమెని ఢీకొట్టడంతో కిందపడి తీవ్రంగా గాయపడింది.

 
విద్యార్థినిని వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.