1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్

భార్య నుంచి జిల్లా కలెక్టర్ బాధ్యతలు స్వీకరించిన భర్త.. ఎక్కడ?

ias couples
వారిద్దరూ వైద్యులు.. ఆ తర్వాత సివిల్ సర్వీస్ పరీక్ష రాసి ఐఏఎస్‌ ఉద్యోగాలకు ఎంపికయ్యారు. భార్య జిల్లా కలెక్టరుగా, భర్త ప్రభుత్వంలో జాయింట్ సెక్రటరీగా విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో భార్యాభర్తలను ప్రభుత్వం బదిలీ చేసింది. భార్య చేస్తూ వచ్చిన జిల్లా కలెక్టర్‌గా భర్తను నియమించింది. దీంతో భార్య నుంచి జిల్లా కలెక్టర్ బాధ్యతలను భర్త స్వీకరించారు. ఈ అరుదైన సంఘటన కేరళ రాష్ట్రంలోని ఆళపుళా జిల్లాలో జరిగింది.
 
ఈ వివరాలను పరిశీలిస్తే, రేణురాజ్‌ అనే ఐఏఎస్ అధికారిణి ఇప్పటివరకు అలప్పుళ కలెక్టర్‌గా పనిచేశారు. ఆమెను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రేణు స్థానంలో శ్రీరామ్‌ వెంకట్రామన్‌ను కొత్త కలెక్టరుగా నియమించింది. 
 
రేణు, శ్రీరామ్‌ భార్యాభర్తలు కావడం విశేషం. మొదట్లో వైద్యులైన వీరిద్దరూ తర్వాత ఐఏఎస్‌ అధికారులుగా మారి, ఈ ఏడాది ఏప్రిల్‌లో పెళ్లి చేసుకున్నారు. కేరళ ప్రభుత్వంలో జాయింట్‌ సెక్రటరీగా పనిచేస్తున్న శ్రీరామ్‌ ఇపుడు జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు.