శుక్రవారం, 3 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 27 జులై 2022 (09:42 IST)

కేరళలో ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ - 685 పందులను చంపేశారు...

pig dies
ఏదేని ఒక కొత్త వైరస్ తొలుత కేరళ రాష్ట్రంలోనే వెలుగు చూస్తుంది. కరోనా వైరస్ తొలుత వెలుగు చూసింది ఇక్కడే. ఆ తర్వాత మంకీపాక్స్ వైరస్ తొలి కేసు నమోదైంది కూడా ఇక్కడే. ఇపుడు ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూ అనే వైరస్ వెలుగు చూసింది. ఈ వైరస్ సోకిన వందలాది పందులు మృత్యువాతపడుతున్నాయి. ఇప్పటికే రెండు పందుల పెంపకం కేంద్రాల్లో 44 పందులు చనిపోయాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు ముందు జాగ్రత్త చర్యగా 685 పందులను చంపేశారు. 
 
ఈ ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూ ఫీవర్ ఎక్కువగా వయనాడ్ మునిసిపాలిటీతో పాటు తవింజల్ గ్రామంలోని ఐదు ఫామ్‌‍లలోని పందులను హతమార్చారు. చంపేసిన పందులను లోతైన గుంతలు తీసి పాతిపెట్టారు. 
 
అయితే ఈ ఫీవర్ గురించి ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఇది ఇతర జంతువులు లేదా మనుషులకు గానీ సోకే ప్రమాదం లేదని కేరళ రాష్ట్ర పశుసంవర్థక శాఖ అదికారి డాక్టర్ రాజేష్ తెలిపారు. ఈ వైరస్ సోకిన పందులను చంపడం మినహా మరో మార్గం లేదని ఆయన వెల్లడించారు.