గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By జె
Last Modified: బుధవారం, 9 సెప్టెంబరు 2020 (19:55 IST)

వదినతో ఒక్క సెల్ఫీ, అడ్డంగా దొరికిపోయిన తమ్ముడు, రోకలిబండతో ఒక్క దెబ్బతో...

వదిన అంటే తల్లితో సమానం. అన్న భార్యను అలాగే చాలామంది చూస్తుంటారు. కానీ ఇక్కడో కామాంధుడు వదినను లోబరుచుకున్నాడు. భర్త ప్రవర్తన నచ్చని ఆ వివాహిత కూడా మరిదితో కామకలాపాలు సాగించింది. అయితే వీరిద్దరి మధ్య జరుగుతున్న తతంగం కాస్త ఒక్క సెల్ఫీ ఫోటోతో బయటపడింది. 
 
తమిళనాడు రాష్ట్రరాజధాని చెన్నై మైలాపూర్‌లో నివాసముండే పళణికి, మరియమ్మాల్‌కు ముగ్గురు పిల్లలున్నారు. పళణి ఆటోడ్రైవర్. గతంలోనే ఒక వివాహం జరిగి భార్య చనిపోయింది. మరియాల్ రెండవ భార్య. ఆటో నడుపుతూ బాగా డబ్బులు సంపాదించేవాడు పళణి. 
 
పళణి తమ్ముడు సెంథిల్ కుమార్ చెన్నైలో ఒక ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నాడు. అయితే సెంథిల్ కుమార్ స్నేహితులతో కలిసి వేరుగా ఉంటున్నాడు. ఆటో నడుపుతున్న పళణికి సంవత్సరం క్రితం ఒక ప్రమాదం జరిగింది. దీంతో అతన్ని చూసేందుకు వచ్చాడు తమ్ముడు.
 
అన్నను పరామర్సించడమే కాకుండా వదినపై కన్నేశాడు. ఆమె నెంబర్ తీసుకుని తరచూ ఫోన్ చేయడం ప్రారంభించాడు. పళణి కోలుకున్న తరువాత ఎప్పటిలాగే ఉదయాన్నే ఆటో నడుపుకుంటూ రాత్రి ఎప్పుడో ఇంటికి వచ్చేవాడు. అది కూడా పూటుగా మద్యం సేవించి వచ్చేవాడు. దీంతో భార్య విసిగిపోయింది.
 
సెంథిల్ కుమార్‌తో ఆమె సన్నిహితంగా మెదలడం ప్రారంభించింది. ఇలా సంవత్సరం వరకు వీరి రాసలీలలకు అడ్డే లేకుండా పోయింది. పళణి తమ్ముడు సెంథిల్ కావడంతో బంధువులు కూడా అనుమానించలేదు. అయితే సెంథిల్ కుమార్ మూడురోజుల క్రితం ఒక ఫోటోను మరియమ్మాల్‌తో తీసుకుని ఫేస్ బుక్‌లో పోస్ట్ చేశాడు.
 
ఆ ఫోటో కాస్తా అలా స్నేహితులకు, బంధువులకు చేరింది. విషయం పళణికి తెలిసిపోయింది. ఇద్దరినీ చంపేయాలనుకుని ప్లాన్ చేశాడు పళణి. పూటుగా మద్యం సేవించి రెండురోజుల క్రితం ఇంటికి వెళ్ళాడు. మధ్యాహ్నం సమయంలో తమ్ముడు, తన భార్య కలిసి ఉండటంతో ఆగ్రహంతో ఊగిపోయాడు.
 
ఇంట్లో ఉన్న రోకలితో బండతో తమ్ముడి తలపై గట్టిగా కొట్టాడు. దీంతో అతడి తల పగిలి అక్కడిక్కడే చనిపోయాడు. భార్య అక్కడి నుంచి పరారైంది. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తండ్రి జైలుకు వెళ్ళడం.. తల్లి కనిపించకుండా పోవడంతో ముగ్గురు పిల్లలు అనాధలుగా మారిపోయారు.