శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 13 ఏప్రియల్ 2020 (22:15 IST)

కరోనా, లాక్ డౌన్, కొవిడ్ పేర్ల తర్వాత మగబిడ్డకు శానిటైజర్ అనే పేరు..!

దేశంలో ప్రధాని మోదీ జనతాకర్ప్యూ ప్రకటించిన రోజు గోరఖ్‌పూర్‌లో తల్లి ఒక ఆడబిడ్డ జన్మించగా తల్లిదండ్రులు 'కరోనా'గా నామకరణం చేశారు. మరోఘటనలో లాక్‌డౌన్‌ ప్రకటించిన ఒక వారానికి డియరియా జిల్లాలో మగబిడ్డ జన్మించగా 'లాక్‌డౌన్‌' అని నామకరణం చేసిన సంగతి తెలిసిందే. అలాగే రామ్‌పూర్‌ ప్రాంతంలో అపుడే జన్మించిన ఒక మగబిడ్డకు 'కొవిడ్‌' అని పేరుపెట్టారు. 
 
ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లో అప్పుడే పుట్టిన ఓ పసివాడికి శానిటైజర్ అని పేరు పెట్టారు. వివరాల్లోకి వెళితే.. రాష్ట్రంలోని షహారాన్‌పూర్‌ జిల్లా విజయ్‌విహార్‌ ప్రాంతానికి చెందిన ఓంవీర్‌సింగ్‌, మోనిక దంపతులు. మోనికకు ఆదివారం నొప్పులు రావడంతో దగ్గరలోని ప్రసూతి ఆసుపత్రికి తరలించగా మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆ సమయంలో మోనిక భర్త ఆ బుడతడికి 'శానిటైజర్‌' అనే పేరు పెట్టారు. 
 
ఈ విషయం తెలిసి.. నర్సులంతా చిరునవ్వులు చిందించారు. కరోనా వైరస్‌ విజృంభిస్తున్నవేళ పుట్టిన కారణంగా తన కుమారుడికి కరోనాను ఓడించే శక్తి ఉన్నట్టు నమ్ముతున్నానని అందుకే శానిటైజర్‌ అని పేరు పెట్టినట్టుగా చమత్కరించాడు. బంధువులందరికి ఫోన్‌ చేసి లాక్‌డౌన్‌ ముగిశాక ఘనంగా వేడుక చేద్దామంటూ చెప్పడం కొసమెరుపు.