యూపీలో 14 ఏళ్ల బాలికపై ఘోరం.. బహిర్భూమికి వెళ్తే..?
యూపీలో మహిళలపై వయోబేధం లేకుండా అత్యాచారాలు చోటుచేసుకుంటున్నాయి. రోజు రోజుకు మహిళలపై చోటుచేసుకుంటున్న అకృత్యాల సంఖ్య పెరిగిపోతోంది. ఫలితంగా యోగి సర్కారుపై విపక్షాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. కఠినమైన శిక్షలు అమలు చేయాలని.. అత్యాచార నిందితులపై కన్నెర్ర చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. ఇంకా నిందితులకు సరైన శిక్ష పడాలని డిమాండ్ చేస్తూ... ఆందోళనలు జరుపుతున్నాయి.
కానీ అత్యాచారాల పర్వానికి ఏ మాత్రం తెరపడం లేదు. నిత్యం ఏదో ఒకచోట ఇలాంటి సంఘటనలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. మహిళలు, బాలికలు, యువతులపై లైంగిక దాడులు చేస్తూనే ఉన్నారు. ఇటీవల హత్రాస్ ఘటన తర్వాత అనేకం వెలుగులోకి వచ్చాయి. తాజాగా మరో మళ్లీ అలాంటి ఘోరం జరిగింది. 14 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం చేసి హత్య చేశారు. గోపీగంజ్ ప్రాంతంలో జరిగింది. బాధిత కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.
14 ఏళ్ల బాలిక గురువారం ఉదయం బహిర్భూమికి వెళ్లింది. ఆమెను అనుసరిస్తూ వెళ్లిన ముగ్గురు వ్యక్తులు వెళ్లారు. తలపై బండరాయితో బలంగా కొట్టారు. తీవ్ర రక్తస్రావంతో అక్కడే ప్రాణాలు వదిలింది. ఎంతసేపటికి బాలిక ఇంటికి రాకపోవడంతో వెళ్లి చూడగా శవమై కనిపించింది. దీంతో పొరుగునే ఉన్నవారిపై అనుమానం వ్యక్తం చేశారు. వారిని శుక్రవారం ఉదయం ముగ్గురు అదుపులోకి తీసుకొని విచారణ ప్రారంభించారు.
శత్రుత్వం కారణంగా ప్రణాళిక ప్రకారమే హత్య చేసినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే అత్యాచారం జరిగిందో లేదో తెలియాల్సి ఉందన్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని బాధిత కుటుంబం డిమాండ్ చేస్తోంది.