మానవత్వం మంటగలిసిపోయింది.. ట్రక్ డ్రైవర్ గాయపడితే.. ఫోన్, డబ్బు దొంగలించేశారు.. (video)
మానవత్వం మంటగలిసిపోయిందనేందుకు ఈ ఘటనే నిదర్శనం. ట్రక్ ప్రమాదానికి గురైంది. ట్రక్కు డ్రైవర్ సీటులోనే ఇరుక్కుపోయాడు. అయితే అతనిని కాపాడాల్సిన మనుషులు.. ఆయన్ని ఏమాత్రం పట్టించుకోకుండా ట్రక్కులో వుండిన డబ్బు, సెల్ ఫోన్‌ను దోచుకున్నారు.
కాపాడండి అంటూ ఆ ట్రక్కు డ్రైవర్ ఎంత వేడుకున్నా.. ట్రక్కులో వుండే వస్తువులపైనే అక్కడున్న వ్యక్తుల దృష్టి పడింది. ఈ క్రమంలోనే ట్రక్కులో కనిపించిన స్మార్ట్ ఫోన్, డబ్బును ఎత్తుకెళ్లారు.
ఇదంతా చూసిన ఆ డ్రైవర్ వేరేం మనుషులంటూ చూస్తుండిపోయాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.