బిగ్ టీవీ డేస్ ప్రకటించిన సామ్‌సంగ్ ఇండియా, ఏఐ శక్తితో కూడిన ప్రీమియం టీవీ రేంజ్
భారతదేశపు అతిపెద్ద వినియోగదారు ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ సామ్‌సంగ్, నూతన సంవత్సరం, గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని తమ 'బిగ్ టీవీ డేస్' ఆఫర్‌ను తీసుకువచ్చింది. Neo QLED 8K, Neo QLED 4K, OLED, 4K UHD TV మోడల్‌లతో సహా దాని ప్రీమియం బిగ్-స్క్రీన్ టీవీలపై ఆకర్షణీయమైన డీల్‌లను అందిస్తోంది, ఈ ఆఫర్ జనవరి 3 నుండి జనవరి 31, 2025 వరకు అందుబాటులో ఉంటుంది.
తమ హోమ్ ఎంటర్‌టైన్‌మెంట్ అనుభవాన్ని మెరుగుపరచుకోవాలని చూస్తున్న వినియోగదారులు రూ. 204,990 విలువైన ఉచిత సామ్‌సంగ్ టివిలు మరియు ఎంపిక చేసిన కొనుగోళ్లతో గరిష్టంగా రూ.99,990 విలువైన సౌండ్‌బార్‌లతో సహా అద్భుతమైన ఆఫర్‌ల నుండి ప్రయోజనం పొందవచ్చు. కస్టమర్‌లు గరిష్టంగా 20% క్యాష్‌బ్యాక్, జీరో డౌన్ పేమెంట్, గరిష్టంగా 30 నెలల కాలవ్యవధితో ఈఎంఐ అవకాశాలను కూడా పొందవచ్చు. భారతదేశంలోని ప్రముఖ ఆన్‌లైన్ పోర్టల్‌లు, సామ్‌సంగ్ రిటైల్ అవుట్‌లెట్‌లలో ఈ ఆకర్షణీయమైన ఆఫర్లు అందుబాటులో ఉంటాయి.
“సామ్‌సంగ్‌లో, మేము మా బిగ్ టీవీ డేస్ ఆఫర్‌తో హోమ్ ఎంటర్‌టైన్‌మెంట్‌ను పునర్నిర్వచించాము, మా ప్రీమియం ఏఐ శక్తితో కూడిన టీవీలపై సాటిలేని డీల్‌లను అందిస్తున్నాము" అని సామ్‌సంగ్ ఇండియాలోని విజువల్ డిస్‌ప్లే బిజినెస్ సీనియర్ డైరెక్టర్ విప్లేష్ డాంగ్ అన్నారు.