సోమవారం, 13 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : శనివారం, 24 డిశెంబరు 2016 (09:32 IST)

ముఖ్యమంత్రి కుర్చీపై చిన్నమ్మ కన్ను.. సీఎం పన్నీర్‌సెల్వంకు పదవీగండం!

తమిళనాడు ముఖ్యమంత్రి పీఠంపై దివంగత ముఖ్యమంత్రి జయలలిత స్నేహితురాలు శశికళా నటరాజన్ కన్నుపడింది. ఈ కుర్చీలో కూర్చొనేందుకు ఆమె ఎత్తులు పైఎత్తులు వేస్తున్నారు. ఇందుకోసం తన వర్గానికి చెందిన నేతలతో తాను అను

తమిళనాడు ముఖ్యమంత్రి పీఠంపై దివంగత ముఖ్యమంత్రి జయలలిత స్నేహితురాలు శశికళా నటరాజన్ కన్నుపడింది. ఈ కుర్చీలో కూర్చొనేందుకు ఆమె ఎత్తులు పైఎత్తులు వేస్తున్నారు. ఇందుకోసం తన వర్గానికి చెందిన నేతలతో తాను అనుకున్నట్టుగా ఆడిస్తున్నారు. ఫలితంగా ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వంకు పదవీగండం తప్పేలా లేదు. 
 
తమిళనాడు రాజకీయాల్లో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అవుననే సమాధానం వస్తోంది. శశికళకు పార్టీ పగ్గాలు అప్పజెప్పడం దాదాపు ఖాయమైపోయింది. ఈ నేపథ్యంలో ఇప్పుడామెను సీఎం పీఠంపై కూర్చో బెట్టేందుకు ముందస్తు రంగం సిద్ధమవుతోంది. అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత కన్ను మూయడంతో పన్నీరు సెల్వంకు సీఎం పీఠం, శశికళకు పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి అప్పగించేలా నేతలు ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. 
 
పన్నీర్‌సెల్వం సీఎంగా ప్రమాణ స్వీకారం చేయగా, శశికళ పగ్గాలు చేపట్టేందుకు ఇంకా ముహూర్తం ఖరారు కాలేదు. ప్రధాన కార్యదర్శి పదవి చేపట్టేందుకు ఆమెకు సభ్యత్వకాలం ఆటంకమయ్యేలా ఉంది. దీంతో పార్టీ నిబంధనలను సైతం మార్చేందుకు నేతలు సిద్ధమయ్యారు. పార్టీ ప్రిసీడియం చైర్మన్ ఇ.మధుసూదనన్ నేతృత్వంలో ఈమేరకు ప్రణాళిక కూడా రూపొందుతోంది. 
 
అదేసమయంలో సీఎం పీఠంపై శశికళను కూర్చోబెట్టేందుకు ఆమె వర్గీయులు పావులు కదుపుతున్నారు. చిన్నమ్మ సీఎం కావాలన్నదే తనలాంటి నేతల అభిమతమని, ఇందుకు పూర్తిస్థాయిలో కృషి చేస్తామని శశికళ అనుచరుడిగా పేరొందిన ఉదయకుమార్‌ ప్రకటించారు. ఈ వ్యవహారం పార్టీలో సంచలనం రేపింది. పార్టీకి, ప్రభుత్వానికి ఒక్కరే నేతృత్వం వహిస్తే బావుంటుందని, అందువల్ల చిన్నమ్మ సీఎం అయితే బావుంటుందని తమతో పాటు పార్టీ మొత్తం భావిస్తోందని జయలలిత సమాధి సాక్షిగా ప్రకటించారు.