శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 5 ఏప్రియల్ 2017 (11:11 IST)

ముస్లింలు బీఫ్‌కు దూరంగా ఉండాలి.. గోవులను వధించడం మానుకోవాలన్న అలీఖాన్‌పై వేటు

ట్రిపుల్ తలాక్, బీఫ్ వంటి అంశాలపై స్పందించిన అజ్మీర్ దర్గా దివామ్ సయ్యద్ జైనుల్ అబెడిన్ అలీఖాన్‌పై మత సంస్థలు మండిపడ్డాయి. దీంతో పాటు అలీఖాన్‌ను తొలగిస్తున్నట్లు.. స్వయంగా ఆయన సోదరుడు అలావుదీన్ అలీమి

ట్రిపుల్ తలాక్, బీఫ్ వంటి అంశాలపై స్పందించిన అజ్మీర్ దర్గా దివామ్ సయ్యద్ జైనుల్ అబెడిన్ అలీఖాన్‌పై మత సంస్థలు మండిపడ్డాయి. దీంతో పాటు అలీఖాన్‌ను తొలగిస్తున్నట్లు.. స్వయంగా ఆయన సోదరుడు అలావుదీన్ అలీమి ప్రకటించారు. తనకు మత సంస్థల మద్దతు ఉందని పేర్కొన్న అలావుదీన్.. తాను అజ్మీర్ దర్గా దివాన్‌గా ప్రకటించుకున్నారు.
 
కాగా దేశంలో మతసామరస్యం వెల్లివిరియాలంటే అక్రమకబేళాలపై నిషేధం విధించాల్సిందేనని అలీఖాన్‌ సెన్సేషనల్ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. అజ్మీర్ దర్గా ఆధ్యాత్మిక వేత్త అయిన అలీఖాన్ ఉత్తరప్రదేశ్‌లో అక్రమ కబేళాల నిషేధంపై ఇటీవల మాట్లాడుతూ కబేళాలను మూసివేయడంతోపాటు బీఫ్ అమ్మకాలపై నిషేధం విధిస్తే దేశంలో మతసామరస్యం వెల్లివిరిస్తుందని పేర్కొన్నారు. 
 
అలాగే ముస్లింలు బీఫ్‌కు దూరంగా ఉండాలని, గోవులను వధించడం మానుకోవాలని సూచించారు. తద్వారా దేశానికి మంచి సంకేతాలు అందించినవారవుతారని పేర్కొన్నారు. అంతేకాక ప్రభుత్వం ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలన్నారు. 
 
ట్రిపుల్ తలాక్‌పై మాట్లాడుతూ విడాకుల కోసం ట్రిపుల్ తలాక్ చెప్పడం షరియా చట్టం ప్రకారం సరికాదన్నారు. షరియా చట్టాన్ని అగౌరవపరచడాన్ని ముస్లింలు మానుకోవాలని హితవు పలికారు. ఈ వ్యాఖ్యలపై మత సంఘాలకు చెందిన నేతలు ఫైర్ అయ్యారు.