బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By
Last Updated : మంగళవారం, 13 నవంబరు 2018 (11:49 IST)

ఐదు నిమిషాల్లో రూ.20వేల కోట్ల సేల్.. ఆలీబాబా అదుర్స్

ఐదు నిమిషాల్లో రూ.20వేల కోట్ల సేల్. ఆన్‌లైన్ బిజినెస్‌లో సరికొత్త రికార్డును అలీబాబా సంస్థ రికార్డు చేసుకుంది. చైనాకు చెందిన అలీబాబా సంస్థ ఆన్‌లైన్ బిజినెస్‌లో అగ్రస్థానంలో వున్నారు. ప్రతీ ఏడాది నవంబర్ నెలలో వచ్చే 11వ తేదీన పలు ఆఫర్లు ప్రకటించడం ఆనవాయితీ. ఈ ఆఫర్‌ను డబుల్ 11 అని పిలుస్తారు. 
 
ఈ ఆఫర్ కింద అలీబాబా సంస్థ ప్రకటించిన ఆఫర్లలో భారీ ఎత్తున కస్టమర్లు కొనుగోలు చేశారు. భారీ ఎత్తున వస్తువులను బుక్ చేశారు. తద్వారా సేల్ ఆరంభమైన ఐదు నిమిషాల్లోనే రూ.20వేల కోట్ల లాభం వచ్చింది.  
 
ఆపై సేల్ ప్రారంభమైన గంటలోపు రూ.70కోట్ల లాభం వచ్చింది. గత ఏడాది ఇదే సేల్‌లో అలీబాబా సంస్థ రూ.1.8 లక్షల కోట్లు ఆదాయంగా పొందింది. ఈ ఏడాది ఈ మొత్తానికి అనేక రెట్లు లాభం గడించింది. అనూహ్యంగా 24 గంటల్లోనే 30 బిలియన్ల ఆదాయాన్ని సమకూర్చింది. ఈ సేల్‌లో ఆపిల్, జియోమి వంటి స్మార్ట్ ఫోన్లు అత్యధికంగా అమ్ముడుపోయాయని అలీబాబా సంస్థ వెల్లడించింది.