గురువారం, 6 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 9 నవంబరు 2016 (09:30 IST)

గుర్తింపు కార్డులు లేకుంటే రూ.500, రూ.1000 నోట్ల మార్పిడి చెల్లదు

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయంతో సాధారణ ప్రజలు ఇబ్బందులు పడే అవకాశం ఉంది. ముఖ్యంగా ప్రస్తుతం తమ వద్ద ఉన్న రూ.500, రూ.1000 నోట్లను ఏం చేయాలో తెలియక తికమక పడుతున్నారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయంతో సాధారణ ప్రజలు ఇబ్బందులు పడే అవకాశం ఉంది. ముఖ్యంగా ప్రస్తుతం తమ వద్ద ఉన్న రూ.500, రూ.1000 నోట్లను ఏం చేయాలో తెలియక తికమక పడుతున్నారు. 
 
నల్లధనాన్ని అరికట్టే చర్యల్లో భాగంగా, రూ.500 నోట్లు, రూ.1000 నోట్లు మంగళవారం అర్థరాత్రి నుంచి చలామణిలో ఉండవని మోడీ ప్రకటించిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో బ్యాంకులు, పోస్టాఫీసుల్లో వీటిని మార్చుకోవడానికి గుర్తింపు పత్రాలు తప్పనిసరి చేశారు. 
 
పాన్ కార్డు, ఆధార్ కార్డ్, ఓటర్ ఐడిలలో ఏదో ఒకటి తప్పనిసరిగా బ్యాంకులు, పోస్టాఫీసుల్లో చూపించి మాత్రమే ఈ నోట్లను మార్చుకోవాల్సి ఉంటుంది. ఈ గుర్తింపు కార్డులు లేకుండా పాత నోట్లను మార్చుకోవడం కుదరదు. అందువల్ల నల్లధనం దాచుకున్న వ్యక్తులు కట్టల కొద్దీ రూ.500 నోట్లు, రూ.1000 నోట్లను మార్చుకోవడం అంత తేలికకాదు.