శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 18 నవంబరు 2016 (18:58 IST)

జయలలితను ఇంకా ఐసీసీయు వార్డులో ఎందుకు ఉంచామంటే.. అపోలో ఛైర్మన్ వివరణ

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితను ఇంటెన్సివ్ క్రిటికల్ కేర్ యూనిట్ (ఐసీసీయు) వార్డులో ఇంకా ఉంచడం పట్ల అపోలో ఆస్పత్రి ఛైర్మన్ డాక్టర్ ప్రతాప్ సి రెడ్డి వివరణ ఇచ్చారు. ఇదే అంశంపై ఆయన శుక్రవారం మీడియాతో మాట్

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితను ఇంటెన్సివ్ క్రిటికల్ కేర్ యూనిట్ (ఐసీసీయు) వార్డులో ఇంకా ఉంచడం పట్ల అపోలో ఆస్పత్రి ఛైర్మన్ డాక్టర్ ప్రతాప్ సి రెడ్డి వివరణ ఇచ్చారు. ఇదే అంశంపై ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ... జయలలిత పూర్తిగా కోలుకున్నారని చెప్పారు. 
 
ప్రస్తుతం ఆమె సాధారణంగానే ఆహారం తీసుకుంటున్నార‌ని, ప్రొటీన్‌ ఫుడ్ అధికంగా ఇస్తున్నామని వివరించారు. జ‌య‌ల‌లిత‌కు రోగనిరోధక శక్తి తక్కువగా ఉంద‌ని, ఈ కార‌ణంగా ఆమెకు ఎటువంటి ఇన్‌ఫెక్షన్లు సోకకుండా అన్ని చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని, ఇందులోభాగంగానే ఐసీసీయు వార్డులో ఉంచినట్టు తెలిపారు. ప్రస్తుతం జయలలితకు రోజుకు 15 నిమిషాల పాటు మాత్రమే వెంటిలేటర్‌ను అమర్చుతున్నట్టు చెప్పారు. 
 
కాగా, సెప్టెంబర్ 22వ తేదీన జయలలిత అనారోగ్యం కారణంగా చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చేరిన విషయంతెల్సిందే. ఆమెకు స్వదేశీ, విదేశీ వైద్యులు అందించిన చికిత్సతో కోలుకున్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం బాగానే ఉందని అపోలో ఛైర్మన్ వెల్లడించారు. ఎప్పుడు డిశ్చార్జ్ కావాలో జయలలితనే నిర్ణ‌యించుకుని ఇక ఇంటికి వెళ్లిపోవ‌చ్చ‌ని, ఆ అంశంలో ఆమె త‌న‌ ఇష్ట‌ ప్ర‌కారం నిర్ణ‌యం తీసుకోవ‌చ్చ‌న్నారు.