సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 3 జనవరి 2017 (08:47 IST)

చైనా, పాకిస్థాన్‌లతో ఏకకాలంలో యుద్ధానికి సిద్ధం : భారత ఆర్మీ చీఫ్

అవసరమైతే అటు పాకిస్థాన్‌..... ఇటు చైనాతో ఏకకాలంలో యుద్ధానికి భారత సైన్యం సర్వసన్నద్ధంగా ఉన్నట్లు సైనికదళాల ప్రధానాధికారి జనరల్‌ బిపిన్‌ రావత్‌ చెప్పారు. అయితే, చైనాతో ఘర్షణకంటే సహకారంపైనే ప్రధానంగా

అవసరమైతే అటు పాకిస్థాన్‌..... ఇటు చైనాతో ఏకకాలంలో యుద్ధానికి భారత సైన్యం సర్వసన్నద్ధంగా ఉన్నట్లు సైనికదళాల ప్రధానాధికారి జనరల్‌ బిపిన్‌ రావత్‌ చెప్పారు. అయితే, చైనాతో ఘర్షణకంటే సహకారంపైనే ప్రధానంగా దృష్టిసారించడం అవసరమన్నారు.
 
భారత ఆర్మీ ‘అగ్ని’ క్షిపణిని విజయవంతంగా ప్రయోగించింది. ఈనేపథ్యంలో ఆయన మాట్లాడుతూ... ఈ క్షిపణి పరీక్షపై చైనా తీవ్ర ఆసక్తిని, ఆశ్చర్యాన్ని ప్రదర్శించిందని ఆయన గుర్తు చేశారు. ఇక సాయుధ దళాల విషయానికి వస్తే..., ఏక కాలంలో రెండు యుద్ధాలు చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ఆయన పునరుద్ఘాటించారు.