బుధవారం, 4 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : గురువారం, 17 నవంబరు 2022 (10:48 IST)

చీటింగ్ కేసులో కేంద్ర సహాయ మంత్రికి అరెస్టు అరెస్టు

nishith pramanik
ఒక చీటింగ్ కేసులో కేంద్ర సహాయ మంత్రిగా ఉన్న నిశిత్ ప్రామాణిక్‌కు బెంగాల్ కోర్టు ఒకటి అరెస్టు వారెంట్ జారీచేసింది. బెంగాల్‌లోని అలీపూర్‌దువార్ రైల్వే స్టేషన్ పరిధిలో బంగారం దుకాణంలో, బీర్‌పాడాలోని రెండు బంగారు దుకాణాల్లో 2009లో చోరీ జరిగింది. ఈ కేసుల్లో ప్రామాణిక్‌తో పాటు మరో వ్యక్తి నిందితులుగా ఉన్నారు. ఈ కేసు విచారణ గత 13 యేళ్లుగా సాగుతోంది. 
 
ఈ నేపథ్యంలో అలీపూర్‌దువార్ జ్యూడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టు బుధవారం ఈ కేసును విచారించి కేంద్ర మంత్రికి అరెస్టు వారెంట్ జారీచేసింది. ఈ వారెంట్ జారీ నేపథ్యంలో తమ తదుపరి చర్య ఏంటో ప్రామాణిక్ తరపు న్యాయవాది దులాల్ ఘోష్ వెల్లడించేందుకు నిరాకరించారు. 
 
కాగా, బెంగాల్ హైకోర్టు ఆదేశం మేరకు ఉత్తర 24 పరగణాల జిల్లా ఎంపీ/ఎమ్మెల్యేల కోర్టు నుంచి ఈ కేసును అలీపూర్‌దువార్ కోర్టుకు బదిలీ చేశారు. కాగా, ఈ కేసులో నిందితుడిగా ఉన్న ప్రామాణిక్ గత 2019 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత ఆయనకు కేంద్ర మంత్రివర్గంలో సహాయ మంత్రిగా చోటు దక్కింది.