గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : సోమవారం, 25 మార్చి 2024 (10:24 IST)

ఆ సమయంలో వాడిన ఫోన్ ఏమైందో తెలియదు : ఢిల్లీ సీఎం కేజ్రీవాల్

arvind kejriwal
ఢిల్లీ లిక్కర్ పాలసీ రూపొందించిన సమయంలో తాను ఉపయోగించిన ఫోను ఎక్కడ పెట్టానో, ఏమైందో తనకు తెలియదని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు. ఈ మేరకు ఆయన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులకు చెప్పారు. ఆ ఫోన్ మిస్సింగ్ అయిందని చెప్పారు. ఈ స్కామ్‌లో భాగంగా, కేజ్రీవాల్ వద్ద ఆదివారం ఈడీ అధికారులు నాలుగు గంటల పాటు ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆయన లిక్కర్ పాలసీ రూపకల్పన సమయంలో తాను వాడిన  ఫోన్ ఏమైందో తనకు తెలియదని చెప్పారు. 
 
కాగా ఈ ఫోన్ న్ను 'మిస్సింగ్ మొబైల్'గా ఈడీ అధికారులు పేర్కొన్నట్టు సంబంధిత వర్గాల ద్వారా తెలుస్తోంది. కాగా కేజీవాలు ఈడీ అధికారులు ఆదివారం విచారించారు. దాదాపు నాలుగు గంటల పాటు ప్రశ్నించారు. మరోవైపు ఈ కేసులో కీలక వ్యక్తిగా ఉన్న సమీర్ మహేంద్రు వాంగ్మూలాన్ని ఈ అధికారులు నమోదు చేశారు. ఇక మంగళవారం మనీశ్ సిసోడియా కార్యదర్శిగా ఉన్న సీ అరవింద్ ఎదుట కేజీవాల్‌ను ప్రశ్నించే అవకాశం ఉందని మీడియా కథనాలు వెలువడుతున్నాయి.
 
కాగా ఈడీ కస్టడీ నుంచి సీఎం కేజ్రివాల్ ఆదివారం తొలి ఆదేశాలను జారీ చేశారు. ఢిల్లీ నగరంలోని కొన్ని ప్రాంతాలలో తాగునీరు, మురుగునీటి సమస్యలను పరిష్కరించాలని మంత్రి అతిషి, అధికారులను ఆయన ఆదేశించారు. వేసవికాలం రావడంతో నీటి సరఫరా వ్యవస్థను పటిష్ఠం చేయాలని, కొరత ఉన్న ప్రాంతాల్లో అవసరమైన మేరకు నీటి ట్యాంకర్లను సిద్ధం చేయాలని ఆదేశించారని తెలిపారు. ఈ విషయాన్ని మంత్రి అతిషి మీడియాకు వెల్లడించారు. కేజీవాల్ ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నప్పటికీ ఢిల్లీ ప్రజల పట్ల ఆయన స్పందిస్తున్న తీరు తనకు కన్నీళ్లను తెప్పించిందని ఆమె అన్నారు.