శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 6 నవంబరు 2021 (14:06 IST)

ఆర్యన్ కేసు బాధ్యతల నుంచి సమీర్ వాంఖడే తొలగింపు

బాలీవుడ్ స్టార్ హీరో షారూక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసును విచారిస్తున్న విచారణాధికారి సమీర్ వాంఖడేను ఆ బాధ్యతల నుంచి తప్పించారు. ఈ మేరకు ముంబై నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) డీజీ ఉత్తర్వులు జారీ చేశారు. 
 
సమీర్ వాంఖడేపై తీవ్రస్థాయిలో అవినీతి ఆరోపణలు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఆర్యన్ ఖాన్ కేసు విచారణ జరుపుతున్న వాంఖడేపై మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ తీవ్ర ఆరోపణలు చేశారు.
 
వాంఖడేను తప్పించిన నేపథ్యంలో ఇకపై ఎన్సీబీకి చెందిన ప్రత్యేక బృందం ఆర్యన్ ఖాన్ వ్యవహారంతో సంబంధం ఉన్న 5 కేసుల విచారణ కొనసాగించనుంది. ఈ మేరకు ఎన్సీబీ స్పెషల్ టీమ్ కు అధికారాలు బదలాయించారు. ఈ నేపథ్యంలో సమీర్ వాంఖడే ఎప్పట్లాగానే ఎన్సీబీ ముంబై విభాగానికి జోనల్ డైరెక్ట‌రుగా కొనసాగనున్నారు.