ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శనివారం, 28 జనవరి 2017 (13:22 IST)

జల్లికట్టులా ట్రిపుల్ తలాక్‌పై ఉద్యమిద్దాం.. పెళ్ళిళ్లు చేసుకుందాం.. విడాకులు ఇచ్చుకుందాం..

జల్లికట్టు ఉద్యమం ముస్లిం నేతలకు కూడా మార్గదర్శిగా నిలుస్తోంది. ట్రిపుల్ తలాక్ ను పలు ముస్లిం మహిళా సంఘాలు వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయంపై సుప్రీంకోర్టులో కేసు కూడా నడుస్తోంది. ఈ నేపథ్యంలో

జల్లికట్టు ఉద్యమం ముస్లిం నేతలకు కూడా మార్గదర్శిగా నిలుస్తోంది. ట్రిపుల్ తలాక్ ను పలు ముస్లిం మహిళా సంఘాలు వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయంపై సుప్రీంకోర్టులో కేసు కూడా నడుస్తోంది. ఈ నేపథ్యంలో ట్రిపుల్ తలాక్‌పై పెను ఉద్యమం చేద్దామంటూ ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ముస్లింలకు పిలుపునిచ్చారు.
 
శనివారం హైదరాబాదులో అసదుద్ధీన్ ఓవైసీ మాట్లాడుతూ.. తమిళుల జల్లికట్టు ఉద్యమానికి ప్రధాని నరేంద్ర మోదీ కూడా తల వంచాల్సి వచ్చిందని, అందుకే ఆ ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకుని, ముస్లింల పెళ్లిళ్లు, ట్రిపుల్ తలాక్ వంటి సంప్రదాయాల్లో ఎవరూ జోక్యం చేసుకోకుండా ఉండేలా పోరాడాలని పిలుపు నిచ్చారు. 
 
తమిళుల్లాగే మనకు కూడా మన సొంత సంస్కృతి ఉందని, మనకు నచ్చినట్టు పెళ్లిళ్లు చేసుకుని, విడాకులు ఇచ్చుకుందామన్నారు. ఇలాగే ప్రవర్తించాలని తమకు ఎవరూ మార్గదర్శకాలు సూచించాల్సిన అవసరం లేదని ఓవైసీ చెప్పుకొచ్చారు.