శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By జె
Last Modified: సోమవారం, 14 జూన్ 2021 (17:31 IST)

అందాల నటి, లక్షద్వీప్‌లో చిచ్చురేపి చలి కాచుకుంటోందా..?

లక్షద్వీప్‌లో నటి అయేషా సుల్తానా కేసు బిజెపిలో చిచ్చు రాజేసింది. ఆమెపై ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేయడాన్ని నిరసిస్తూ 12 మంది బిజెపి నేతలు ఆ పార్టీ లక్షద్వీప్ అధ్యక్షుడు అబ్ధుల్ ఖాన్‌కు రాజీనామా లేఖలను పంపారు. అయేషాపై అబ్ధుల్ ఖాన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంపై వాళ్ళు మండిపడుతున్నారు.
 
లక్షద్వీప్‌లో అడ్మినిస్ట్రేటర్ ప్రపుల్ కె.పటేల్ నిర్ణయాలను అక్కడి బిజెపి నేతలు, కార్యకర్తలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఆమెపై తప్పుడు ఫిర్యాదులు ఎందుకు చేశారని నిలదీస్తున్నారు. కావాలనే ఆమెపై కక్షకట్టి ఇలా చేస్తున్నారంటూ బిజెపి నేతలు పార్టీ సభ్యత్వానికి రాజీనామాలు చేసేశారు.
 
లక్షద్వీప్‌లో అడ్మినిస్ట్రేటర్‌గా నియమించిన ప్రపుల్ పటేల్ పైన స్థానికంగా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అతని నిర్ణయాలను వ్యతిరేకిస్తూ జనం పలు రకాలుగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో కరోనా కట్టడి చేయడంలో ప్రభుత్వం విఫలమైందంటూ నటి అయేషా సుల్తాన్ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు కాస్త సంచలనం రేపాయి. బిజెపి నేతల ఫిర్యాదుతో ఆమెపై రాజద్రోహం కేసు నమోదైంది. ఇప్పుడీ వ్యవహారం స్థానికంగా చర్చనీయాంశంగా మారుతోంది.