శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 1 సెప్టెంబరు 2017 (15:20 IST)

డ్రైనేజీలో డేరా బాబా.. గుర్మీత్‌కు పద్మ పురస్కారం ఇవ్వాలట?

సీబీఐ ప్రత్యేక కోర్టు డేరా బాబాను దోషిగా ప్రకటించిన సంగతి తెలిసిందే. దోషిగా తేలిన తర్వాత అతడు పారిపోవాలని ప్లాన్ చేశాడు. అందుకోసం ఆత్మాహుతి దళాలను రెడీ చేశాడు. కానీ ఆ స్కెచ్‌కు పోలీసులు చివరి నిమిషంలో

సీబీఐ ప్రత్యేక కోర్టు డేరా బాబాను దోషిగా ప్రకటించిన సంగతి తెలిసిందే. దోషిగా తేలిన తర్వాత అతడు పారిపోవాలని ప్లాన్ చేశాడు. అందుకోసం ఆత్మాహుతి దళాలను రెడీ చేశాడు. కానీ ఆ స్కెచ్‌కు పోలీసులు చివరి నిమిషంలో చెక్ పెట్టారు. ఆగస్టు 25న పంచకుల సీబీఐ ప్రత్యేకకోర్టు బాబాను దోషిగా ప్రకటించింది.

కోర్టునుంచి బయటికొచ్చిన డేరాబాబా.. సిర్సా నుంచి తీసుకొచ్చిన ఎర్రబ్యాగు ఇవ్వాలని తన భద్రతా సిబ్బందిని కోరాడు. ఎర్రబ్యాగు ఇస్తే కోర్టు దోషిగా ప్రకటించిందని.. పంచకులతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా విధ్వంసానికి పాల్పడాలనే సంకేతం ఇచ్చాడు. విధ్వంసాలు జరిగినా హర్యానా ఇంటెలిజెన్స్ ఐజీ కేకే రావు పారిపోవాలనుకున్న డేరా బాబా స్కెచ్‌ను చెక్ పెట్టారు.
 
ఇదిలా ఉంటే దేవుడని నమ్మిన భక్తులను మోసం చేసిన డేరా బాబాపై అందరూ ఫైర్ అవుతున్నారు. అతని ఫోటోలను కాళ్ళ కింద వేసి తొక్కుతున్నారు. డ్రైనేజీల్లో విసిరేస్తున్నారు. రాజస్థాన్‌లోని శ్రీగంగానగర్‌లో వందలాది భక్తులు అతని ఫోటోలను డ్రైనేజీల్లో విసిరిపారేశారు.

డేరా బాబా ప్రస్తుతం రోహ్‌తక్ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. కానీ డేరాబాబాకు పద్మ పురస్కారం ఇవ్వాలని 4208 మంది కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. మరి డేరా బాబాకు కేంద్రం ఏమిస్తుందో వేచి చూడాలి.