శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 29 ఆగస్టు 2017 (09:52 IST)

డేరా బాబాతో హనీప్రీత్ నగ్నంగా కనిపించింది.. 16 ఏళ్ల బాలికను కాపలా పెట్టి రేప్ చేశాడు.. అరుస్తుంటే విన్నాను?

డేరా బాబా ఎంత కీచకుడో.. అతని వద్ద ఒకప్పుడు అంగ రక్షకుడిగా పనిచేసిన బియాంత్ సింగ్ వెల్లడించాడు. ఎప్పుడూ బాబాతో పక్కనే వుండే దత్తపుత్రిక హనీప్రీత్‌ బాబాను తండ్రిగా చెప్తుందే కానీ.. వారికి వేరే సంబంధం వు

డేరా బాబా ఎంత కీచకుడో.. అతని వద్ద ఒకప్పుడు అంగ రక్షకుడిగా పనిచేసిన బియాంత్ సింగ్ వెల్లడించాడు. ఎప్పుడూ బాబాతో పక్కనే వుండే దత్తపుత్రిక హనీప్రీత్‌ బాబాను తండ్రిగా చెప్తుందే కానీ.. వారికి వేరే సంబంధం వుందన్నాడు. ఆమెను కూతురుగా చెప్తున్న బాబా సిగ్గుపడాలి. ఆమె విశ్వాస్ గుప్తా అనే వ్యక్తి భార్య. అతడో మంచి పేరున్న కుటుంబానికి చెందిన వ్యక్తి. ఒకప్పుడు బాబా భక్తుడు. 
 
ఒకరోజు విశ్వాస్‌గుప్తా డేరాకు వచ్చేసరికి ఆయన భార్య బాబా బెడ్‌రూమ్‌లో, ఆయనతో అభ్యంతరకర స్థితిలో కనిపించిందని.. ఈ విషయాన్ని విశ్వాస్ గుప్తా గతంలో మీడియాకు తెలిపారనే విషయాన్ని కూడా వెల్లడించాడు. తన భార్య బాబాతో నగ్నంగా కనిపించిందని తెలిపారు. ఆపై బాబా విశ్వాస్ గుప్తాను వేధించి, వారి ఆస్తిని స్వాధీనం చేసుకుని అమ్మేశారని బియాత్ సింగ్ చెప్పుకొచ్చాడు. 
 
గుర్మీత్ సింగ్‌కు కోర్టులో రెండు కేసులకు మాత్రమే శిక్షపడిందని.. అలాంటి ఘోరాలెన్నో అతడు చేశాడని వివరించాడు. తనను కాపలా వుంచి 16 ఏళ్ల అమ్మాయిపై అత్యాచారానికి పాల్పడ్డాడని బియాంత్ సింగ్ తెలిపారు. ఇంకా 300 మంది పురుష ఉద్యోగులను శృంగారానికి పనికిరాకుండా చేశారన్నాడు. 
 
300 మందిని నపుంసకులుగా.. శృంగారానికి పనికిరానివారిగా మార్చేశాడు. కొందరికి ఆపరేషన్లు చేసి పిల్లలు పుట్టకుండా చేశారు. పితాజీ గుఫా అత్యాచారాలకు పాపకూపమని.. మదమెక్కిన మృగాన్ని.. దైవదూతగా భావించి 270 మందికిపైగా అమాయకురాళ్లు అతడి కామదాహానికి బలైపోయారని తెలిపారు.

ఒకసారి 16ఏళ్ల అమ్మాయిని టెంట్‌లోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. ఆ అమ్మాయి అరుపులు విన్నాను. ఇది 1996లో జరిగింది. ఆ సంఘటనతో ఆతనిపై తనకు అసహ్యమేసిందని చెప్పుకొచ్చాడు. 
 
అత్యాచారానికి గురైన ఆ బాలిక ఇంకా డేరా ఆశ్రమంలోనే వుంది. ఆమే కాదు 250 మందికి పైగా అమ్మాయిల్ని రేప్‌ చేశారు. 300 మంది సాధ్వీల్లో దాదాపు 90 శాతం మంది అతడి కామదాహానికి బలైనవారేనని షాకింగ్ నిజాలను బయటపెట్టాడు. 
 
అత్యాచారాలే కాదు.. హత్యలు కూడా అక్కడ సర్వసాధారణం. గుర్మీత్‌ బాబా డేరా బాధ్యతలు చేపట్టాక చేసిన తొలి హత్య ఫకీర్‌ చంద్‌ది. అతణ్ని చంపి శవం కనిపించకుండా చేశాడని ఆరోపించారు. ఇలా వందల మందిని హత్య చేశాడని.. తొలినాళ్లలో శవాల్ని పాకడా నదిలో పారేసేవారు. ఆ తర్వాత ఆశ్రమంలోనే తగలబెట్టేవారు. కొందరిని పూడ్చేసేవారు. అస్థికలను తోటలో వేసేవారని బియాత్ చెప్పుకొచ్చాడు.