గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 10 నవంబరు 2020 (06:30 IST)

ఘనంగా ఏనుగుపిల్ల పుట్టినరోజు... ఎక్కడ? ఏంటా కథ?

ఓ ఏనుగుపిల్ల తన మొదటి పుట్టినరోజును ఘనంగా జరుపుకుంది. ఆ ఏనుగుపిల్ల పేరు శ్రీకుట్టి. అడవిలో రెస్క్యూటీంకి రెండురోజుల పిల్లప్పుడు, చాలా తీవ్రమైన పరిస్థితిలో ఉన్నప్పుడు కనిపించింది.

ఆ సమయంలో దాన్ని బయటకు తీసుకువచ్చి, రెస్క్యూ సెంటర్‌కు చెందిన డాక్టర్‌ ఈశ్వరన్‌ దానిపై ప్రత్యేక శ్రద్ద వహించి, ఆరునెలలు చాలా జాగ్రత్తగా కాపాడారు. తినడానికి అరటిపండ్లు, లేత కొబ్బరినీళ్లు ఆహారంగా అందించారు.

దాంతో ఆరోగ్యం కుదుటపడింది. మరి ఇంతా చేసినప్పుడు మొదటి పుట్టినరోజును జరపకపోతే ఎలా..? అందుకే రెస్క్యూ టీమే.. 15 ఏనుగుల మధ్య కేక్‌ని కట్‌ చేపించి తన పుట్టినరోజును జరిపింది.

ఈ పుట్టినరోజు వేడుకలో అటవీ కార్యదర్శి రాజేష్‌కుమార్‌ సిన్హా పాల్గొన్నారు. ఈ బర్త్‌డే పార్టీ చాలా గ్రాండ్‌గా.. వచ్చిన అతిధులకు రుచికరమైన విందు భోజనం అందజేసిందట రెస్క్యూ టీమ్‌.