శనివారం, 1 మార్చి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ivr
Last Modified: మంగళవారం, 27 డిశెంబరు 2016 (22:25 IST)

నా భర్త రాత్రిపూట అలా చేసి హింసిస్తున్నాడు... పోలీసులకు సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఫిర్యాదు

కొంతమంది పెళ్లయ్యాక విచిత్రంగా ప్రవర్తిస్తుంటారు. అబ్బాయిలు - అమ్మాయిలు ఇద్దరిలోనూ ఇలాంటి ప్రవర్తన కనబడుతుంటుంది. ముఖ్యంగా అబ్బాయిల్లో కొందరు పెళ్లయ్యాక తమలో దాగి ఉన్న వింత కోణాల్ని బయటకు తీసి భార్యను తమ చేష్టలతో హింసిస్తుంటారు. ఇలాంటి ఘటన ఒకటి బెంగళ

కొంతమంది పెళ్లయ్యాక విచిత్రంగా ప్రవర్తిస్తుంటారు. అబ్బాయిలు - అమ్మాయిలు ఇద్దరిలోనూ ఇలాంటి ప్రవర్తన కనబడుతుంటుంది. ముఖ్యంగా అబ్బాయిల్లో కొందరు పెళ్లయ్యాక తమలో దాగి ఉన్న వింత కోణాల్ని బయటకు తీసి భార్యను తమ చేష్టలతో హింసిస్తుంటారు. ఇలాంటి ఘటన ఒకటి బెంగళూరులో జరిగింది. బెంగళూరు ఇందిరా నగర్‌లో ఉంటున్న 29 ఏళ్ల యువతి బెంగళూరులో పోలీసులకు చేసిన ఫిర్యాదులో.... ఏడాదిగా తన భర్తతో నరకం చూస్తున్నాననీ, రాత్రి కాగానే ఆడవాళ్లలా చీర కట్టుకుని వస్తాడనీ, అతడి వైఖరితో తనకు నిద్రపట్టడంలేదనీ, అతడితో ఉండలేనని ఫిర్యాదు చేసింది.
 
త‌న భ‌ర్త‌ పగలు ఆఫీసుకు వెళ్లి సాయంత్రం ఇంటికి వచ్చి త‌న‌లా మేకప్‌ వేసుకుంటాడని ఆమె చెప్పింది. చీర మాత్రమే ధరిస్తూ మహిళలా ప్రవర్తిస్తాడని పేర్కొంది. త‌మ పెళ్లి జ‌రిగి ఏడాది గ‌డిచింద‌ని, అయినప్ప‌టికీ తామింకా దగ్గర కాలేదని, అతడిని భరించడం తన వల్లకాదని ఫిర్యాదులో పేర్కొంది. ఆమె భర్త కూడా తను ఆమెతో విడాకులు తీసుకునేందుకు అంగీకరించాడు.