ఆదివారం, 26 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 7 సెప్టెంబరు 2020 (22:54 IST)

బర్త్ డే పార్టీకి వచ్చిన బ్యూటీషియన్‌పై సామూహిక అత్యాచారం.. ఎక్కడ?

ఉత్తర్‌ప్రదేశ్‌లో నేరాల సంఖ్య పెచ్చరిల్లిపోతోంది. మహిళలపై అకృత్యాలు పెరిగిపోతున్నాయి. తాజాగా యూపీ ప్రయాగ్రాజ్‌లో ఓ యువతిపై స్నేహితులు గ్యాంగ్ రేప్ చేసిన ఘటన సంచలనం సృష్టించింది. యువతి వృత్తిరీత్యా బ్యుటీషియన్ కాగా మిత్రుడి పుట్టినరోజు పార్టీకి వెళ్లినప్పుడు ఘటన చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు.
 
వివరాల్లోకి వెళితే.. ప్రయాగ్రాజ్‌లోని బెనిగంజ్‌కు చెందిన ఓ 20ఏళ్ల బ్యుటిషియన్‌ను ఆమె స్నేహితుడు తన పుట్టినరోజు సందర్భంగా పార్టీ ఇస్తానని సులేం సారాయ్ వద్దనున్నతన ఇంటికి శనివారం పిలిచాడు. ఆరోజు రాత్రి స్నేహితులందరూ కేక్ కట్ చేసి, మద్యం సేవించి ఎంజాయ్ చేశారు. 
 
యువతి కూడా ఫూటుగా మద్యం సేవించడంతో రాత్రి పదిగంటల సమయంలో ఆమె స్నేహితుడితో సహా కొంతమంది యువకులు యువతిపై గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారు. తేరుకున్న తరువాత అదేరోజు అర్థరాత్రి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి యువతి ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.