చంద్రుడిపై విత్తనాలను పంపి మొలకెత్తేలా చేస్తారట.. అందుకు ఐడియాలు కావాలట.. మీరిస్తారా?
చంద్రుడిపైకి రోవర్ ద్వారా విత్తనాలను పంపి మొలకెత్తించేలా చేయనున్నారు. అందుకు ఐడియాలు కావాలట. మీరు చేయాల్సిందల్లా..? ల్యాబ్‌టుమూన్ పోటీలో పాల్గొనాలి. ఇందులో పాల్గొనాలంటే.. 14-25 ఏళ్లలోపున్న ముగ్గురు స
చంద్రుడిపైకి రోవర్ ద్వారా విత్తనాలను పంపి మొలకెత్తించేలా చేయనున్నారు. అందుకు ఐడియాలు కావాలట. మీరు చేయాల్సిందల్లా..? ల్యాబ్‌టుమూన్ పోటీలో పాల్గొనాలి. ఇందులో పాల్గొనాలంటే.. 14-25 ఏళ్లలోపున్న ముగ్గురు సభ్యుల బృందం ఉండాలి. ఎల్2ఎమ్.టీమ్‌ఇండస్.ఇన్ అనే వెబ్ సైట్‌లో ఆగస్టు 20లోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సుమారు 300 పదాల్లో మీ ఐడియాను రాసి.. రెండు నిమిషాల వీడియోలో వివరణ ఇచ్చి పంపాలి
చంద్రుడి మీదికి రోవర్‌ను పంపేందుకు గూగుల్ కంపెనీ లూనార్ ఎక్స్‌ప్రైజ్ పేరుతో తొలిసారిగా ప్రైవేటు సంస్థలకు భారీ పోటీ నిర్వహిస్తోంది. ఇందులో అనేక బృందాలు పోటీ పడగా.. భారతకు చెందిన టీమ్ ఇండస్ టాప్ 3లో నిలిచింది. ఇందులో భాగంగా 2017లో చంద్రుడిపైకి పంపేందుకు టీమ్ ఇండస్ ఓ రోవర్‌ను తయారు చేస్తోంది.
ఈ రోవర్‌పై 250 గ్రాముల బరువైన పేలోడ్‌లో భాగంగా విత్తనాలను మొలకెత్తించడం, జీవుల మనుగడకు దోహదపడే ఇతర ప్రయోగాలు చేయాలని టీమ్ ఇండస్ భావిస్తోంది అందుకే ల్యాప్2మూన్ అనే కాంటెస్టును పెట్టింది. ఈ పోటీలో పాల్గొని.. చంద్రుడిపై జీవుల మనుగడకు ఉపయోగపడే కొత్త ప్రయోగాల కోసం ఐడియాలు చెప్పాల్సిందిగా ఇండస్ సంస్థ వెల్లడించింది. ఈ కాంటెస్ట్ ద్వారా సూపర్ ఐడియాలను ఇచ్చిన వారికి భారీ నగదు బహుమతులతో పాటు రోవర్‌లో 500 మీటర్ల మేర ప్రయాణించే సదుపాయాన్ని కూడా కల్పించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.