గురువారం, 13 ఫిబ్రవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By దేవి
Last Updated : గురువారం, 13 ఫిబ్రవరి 2025 (11:36 IST)

పెళ్లి వయస్సు వచ్చింది, దెయ్యంకంటే మనుషులంటే భయం : విశ్వక్ సేన్

Vishwaxen
యువ హీరోలు వయస్సు వచ్చాక వివాహాలు చేసుకోవడం సహజమే. అయితే రేపు విడుదల కాబోయే  'లైలా' చిత్రంలో  స్త్రీగా నటించాడు. ఆపాత్ర చేసినప్పుడు స్త్రీ అనుకుని కొందరు వెంటపడతారు. అది కథలో భాగమే. అందులో ఓ నటుడు నన్ను ప్రేమిస్తాడు. అతను దగ్గరకు వస్తే కొంచెం భయం వేసింది. ఎందుకంటే తను రక్త చరిత్ర సినిమాలో  క్రుయాల్ గా చేసాడు. తెలుగులో 'మేడమ్', 'చిత్రం భలారే చిత్రం' మరియు 'భామనే సత్య భామనే' వంటి కొన్ని చిత్రాలు వచాయి. అందుకే ఈ సినిమా చేసాను. నేను చేసిన స్త్రీ పాత్రకు గాయని శ్రావణ భార్గవి డబ్బింగ్ చేసిందని . అన్నారు.
 
విశ్వక్ సేన్ వచ్చే మార్చికి  30 ఏళ్లలోకి అడుగుపెట్టబోతున్నాడు. అందుకే  “నేను పెళ్లి చేసుకునే మూడ్‌లోకి వచ్చాను” అని ఆయన అన్నారు. తన మనసులో ఎవరూ లేరని, తనకు ఎలాంటి అమ్మాయి కావాలో కూడా తనకు తెలియదని ఆయన అన్నారు. “అది వచ్చినప్పుడు, నేను చూస్తాను. పెద్దలు కుదిర్చిన పెళ్ళే చేసుకుంటానని అన్నారు.
 
హారర్ సినిమాల గురించి చెపుతూ,. “నిజ జీవితంలో ఏదైనా అనిపించినప్పుడు, దాన్ని తెరపై కూడా చూపించవచ్చు. దెయ్యాలు ఎక్కడ ఉన్నట్లు మనం చూడలేదు. సినిమాలలో చుస్డాను.  కానీ నేను ఖాళీ థియేటర్‌లో కూడా చాలా హారర్ సినిమాలు చూశాను, కానీ నాకు భయం లేదు, కాబట్టి నేను హారర్ సినిమాలు చేయను. కానీ నాకు మనుషులంటే భయం. “మనం మనుషులం ఏదైనా చేయగలం” అని ఆయన అన్నారు.