సంబంధిత వార్తలు
- మహిళలకు క్షమాపణలు చెప్పిన దర్శకుడు త్రినాధ రావు
- హీరోయిన్‌పై డైరెక్టర్ వల్గర్ కామెంట్స్ - వివాదానికి ఆజ్యం (Video)
- Nakkina Thrinadha Rao: తెలుగుకి అలా సరిపోరు.. తిని సైజులు పెంచమని చెప్పా- నక్కి (video)న
- రామ్ చరణ్ కి రంగస్థలం ఎలానో నరేష్ కి బచ్చలపల్లి అలా : నిర్మాత రాజేష్ దండా
- దళపతి విజయ్ తనయుడు జాసన్ సంజయ్ దర్శకత్వంలో సందీప్ కిషన్ హీరో
బ్యాచ్‌లర్స్ జీవితంలో స్ట్రగుల్స్ ను మజాకా చేసుకుంటున్న సందీప్ కిషన్
Sandeep Kishan -Majaka
సీనియర్ నటుడు రావురమేష్‌కు జోడీగా మన్మధుడు ఫేం అన్షు నటిస్తున్న ఈ చిత్రం నుంచి ఇటీవల విడుదలైన టీజర్ సినిమాపై అంచనాలు పెంచేసింది. ముఖ్యంగా రావు రమేష్, సందీప్ కిషన్ మధ్య వచ్చే సీన్స్ థియేటర్లలో ప్రేక్షకులకు పొట్టచెక్కలయ్యేలా ఉన్నాయి. ఫిబ్రవరి 21న రాబోతున్న ఈ సినిమా ప్రమోషన్స్ ఫుల్ స్వింగ్‌లో సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా సినిమా నుంచి మొదటి పాట బ్యాచ్‌లర్ యాంథమ్‌ను విడుదల చేశారు మేకర్స్.
బ్యాచ్‌లర్స్ జీవితంలో ఉండే స్ట్రగుల్స్, జాయ్స్‌ను హైలైట్ చేసేలా ఉన్న ఈ సాంగ్ కుర్రాళ్లకు చార్ట్‌బస్టర్ కానుంది. రామజోగయ్య శాస్త్రి రాసిన ఈ పాట కుర్రాళ్లకు ఎవర్‌గ్రీన్ ఫేవరెట్ కానుంది. ఈ పాటలో బ్యాచ్‌లర్స్ తమ జీవితంలో పడే వంట కష్టాలు, సింగిల్ షాపింగ్ ట్రిప్స్ వంటి వాటిని చాలాబాగా ఎలివేట్ చేశారు. రామజోగయ్య శాస్త్రి రాసిన ఈ పాటను ధనుంజయ్ సీపాన ఎంతో హుషారుగా ఆలపించారు. కుర్రాళ్లందరికీ కనెక్ట్ అయ్యేలా తన గాత్రంతో కట్టిపడేశారు. లియోన్ జేమ్స్ అందించిన సంగీతం పాటకు మరింత ప్లస్ అయింది. రఘు మాస్టర్ అందించిన స్టెప్పులతో ఈ పాట సినిమాలో హైలైట్‌గా నిలవనుంది. ఈ పాటను సందీప్ కిషన్-రావు రమేష్‌లపై వైజాగ్ బీచ్‌లో చిత్రీకరించారు. తండ్రీకొడుకుల బ్యాచ్‌లర్ జీవితంలో ఎత్తుపల్లాలను కళ్లకు కట్టినట్లు చూపించేలా తీశారు. వారిద్దరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ ప్రేక్షకులను పడిపడినవ్వేలా చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. సినిమా మ్యూజికల్ ప్రమోషన్స్‌కు ఈ బ్యాచ్‌లర్ యాంథమ్ బ్లాక్‌బస్టర్ బిగినింగ్‌లా చెప్పొచ్చు.
