కొత్త ప్రియుడు కోసం పాతప్రియుడు(భర్త)ను అలా చేసేసిన భార్య
వివాహేతర సంబంధం ఓ కుటుంబాన్ని నిలువునా కూల్చింది. తనకు రెండేళ్ల క్రితం పరిచయమైన యువకుడితో లైంగిక సంబంధం పెట్టుకున్న ఓ మహిళ ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తనే హత్య చేసేసింది.
వివరాల్లోకి వెళితే... కర్నాటకలోని మండ్య తాలూకాలోని హనకెరెలో 35 ఏళ్ల ప్రదీప్, 30 ఏళ్ల శిల్పను 13 ఏళ్ల క్రిందట ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వారికి 12 ఏళ్ల కుమారుడు కూడా వున్నాడు. ఐతే గత రెండేళ్ల క్రితం స్వయం సేవా సంఘాలకు రుణాలను ఇప్పించే మధుతో పరిచయం ఏర్పడింది.
ఈ పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసింది. దీనితో భర్త ఇంట్లో లేనప్పుడు ప్రియుడికి ఫోన్ చేసి ఇద్దరూ ఎంజాయ్ చేయడం ప్రారంభించారు. విషయం కాస్తా భర్తకు తెలియడంతో శిల్పను తీవ్రంగా మందలించాడు. దాంతో భర్తను ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని ప్రణాళిక వేసింది భార్య.
నవంబర్ 18వ తేదీన రాత్రి భోజనంలో భర్తకు నిద్రమాత్రలు కలిపి ఇచ్చింది. భోజనం చేసి అతడు అపస్మారక స్థితిలోకి వెళ్లాక ఊపిరాడకుండా చేసి చంపేసింది. ఆ తర్వాత తన భర్త గుండెపోటుతో మరణించాడంటూ ఏడ్చింది. ఆ తర్వాత వెంటనే భర్త అంత్యక్రియలు కూడా జరిపించేసింది. కానీ భర్త చనిపోయి 10 రోజులు కూడా కాకముందే ప్రియుడితో ఎంజాయ్ చేస్తోంది. ఆమె వ్యవహారశైలిపై అనుమానం వచ్చిన భర్త తరపువారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటపడింది. ఇద్దరినీ అరెస్టు చేసి రిమాండుకి తరలించారు.