తమ్ముడి పెళ్లి కోసం భార్య ఇండియాకు, అమెరికాలో భర్త మంచంపై శవమై తేలాడు

deadbdoy
ఐవీఆర్| Last Modified గురువారం, 3 డిశెంబరు 2020 (15:51 IST)
విదేశాల మోజు మొదట్లో బాగానే వుంటుంది. కానీ ఏదయినా అనుకోనిది జరిగినప్పుడు గుండెలు బద్ధలవుతాయి. ఇలాంటిదే ఒకటి అమెరికాలో ఓ తెలుగు కుటుంబానికి ఎదురైంది.

వివరాల్లోకి వెళితే... తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని బోడుప్పల్‌కు చెందిన శ్రీధర్ ఆరేళ్ల క్రితం అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజినీరుగా స్థిరపడ్డాడు. తన ఝాన్సీ, కుమారుడు శ్రీజన్‌తో కలిసి వుంటున్నాడు. ఐతే గత మార్చి నెలలో తన సోదరుడి వివాహం వుండటంతో భార్య ఝాన్సీ ఇండియా వచ్చింది. కరోనా లాక్ డౌన్‌తో ఆమె ఇక్కడే చిక్కుకుపోయింది.

ఇక అప్పట్నుంచి శ్రీధర్ ఒంటరిగా అక్కడే వుంటున్నాడు. ఐతే అతడి కుటుంబానికి పిడుగులాంటి వార్త చేరింది. శ్రీధర్ గత నెల 27వ తేదీ మృతి చెందాడని చెప్పారు. అతడు చనిపోయిన వారం తర్వాత ఈ వార్త తెలియడంతో అతడి భార్య, కుటుంబ సభ్యులు తల్లడిల్లుతున్నారు. మృతదేహానికి కోవిడ్, పోస్టుమార్టం నిర్వహించినా అతడి భౌతికకాయాన్ని పంపించడంలో అయోమయం నెలకొంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపి తన పార్థీవశరీరాన్ని భారతదేశానికి తెప్పించాల్సిందిగా భార్య ఝాన్సీ కోరుతున్నారు.దీనిపై మరింత చదవండి :