శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 10 జనవరి 2018 (18:48 IST)

'హ్యాపీ నారి' పేరుతో రైల్వే స్టేషన్‌లో నాప్కిన్...

హ్యాపీ నారి పేరుతో రైల్వే స్టేషన్‌‌లో తొలిసారి నాప్కిన్స్ అందించనున్నారు. మ‌హిళా ప్ర‌యాణికుల సౌక‌ర్యార్థం శానిట‌రీ నాప్కిన్ వెండింగ్ మెషీన్‌ను దేశంలోనే తొలిసారి భోపాల్ రైల్వే స్టేష‌న్ అందుబాటులో ఉంచిం

హ్యాపీ నారి పేరుతో రైల్వే స్టేషన్‌‌లో తొలిసారి నాప్కిన్స్ అందించనున్నారు. మ‌హిళా ప్ర‌యాణికుల సౌక‌ర్యార్థం శానిట‌రీ నాప్కిన్ వెండింగ్ మెషీన్‌ను దేశంలోనే తొలిసారి భోపాల్ రైల్వే స్టేష‌న్ అందుబాటులో ఉంచింది. ఈ వెండింగ్ మెషీన్ ద్వారా రూ.5కే శానిట‌రీ నాప్కిన్‌ని అంద‌జేస్తారు. 
 
రైల్వే స్టేష‌న్‌లోని మొద‌టి ప్లాట్‌ఫాంలో పేరుతో జ‌న‌వ‌రి 1న రైల్వే విమెన్ వెల్ఫేర్ అసోసియేష‌న్ ఆఫ్ భోపాల్ ఈ వెండింగ్ మెషీన్‌ను ఏర్పాటు చేసింది. హ్యాపీ నారి పేరుతో వీటిని విక్రయిస్తారు. కాగా, ఈ యంత్రం ఏర్పాటు చేసిన 9 గంట‌ల్లోనే 600 నాప్కిన్లు అమ్ముడయ్యాయి.