గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 4 జనవరి 2018 (10:20 IST)

"ఆ" లింకు పెట్టుకున్న యువకుడితో వివాహానికి సమ్మతించిన భర్త

సాధారణంగా వివాహమైన తర్వాత భార్యలు ఉండగానే భర్తలు రెండో వివాహం చేసుకోవడం చూస్తున్నాం. కానీ, ఆ భర్త మాత్రం తన భార్య వివాహేతర సంబంధం పెట్టుకున్న యువకుడిని పెళ్లాడేందుకు సమ్మతించాడు. బీహార్‌లోని వజీర్‌గంజ

సాధారణంగా వివాహమైన తర్వాత భార్యలు ఉండగానే భర్తలు రెండో వివాహం చేసుకోవడం చూస్తున్నాం. కానీ, ఆ భర్త మాత్రం తన భార్య వివాహేతర సంబంధం పెట్టుకున్న యువకుడిని పెళ్లాడేందుకు సమ్మతించాడు. బీహార్‌లోని వజీర్‌గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక వింత వైనం చోటుచేసుకుంది. 
 
బీహార్ రాష్ట్రంలోని కరదాకు చెందిన గఫ్తర్ అలీకి తొమ్మిదేళ్ల క్రితం డల్లాపూర్‌కు చెందిన ఓ యువతితో వివాహమైంది. వీరి దాంపత్య జీవితానికి గుర్తుగా ఇద్దరు పిల్లలు పుట్టారు. ఈ క్రమంలో ఉపాధి కోసం గఫ్తర్ అలీ విదేశాలకు వెళ్లాడు. దీంతో తన ఇద్దరు పిల్లలతో ఆ మహిళ ఇంటిపట్టునే ఉంటూ వచ్చింది. 
 
ఈనేపథ్యంలో గ్రామంలోని ఒక యువకునితో ఆమెకు సాన్నిహిత్యం ఏర్పడింది. దీంతో వారు కలిసి జీవించాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని భర్తకు ఫోను ద్వారా తెలిపింది. దీంతో ఆయన తన భార్య మరో వివాహానికి మొబైల్ ఫోనులోనే అనుమతిచ్చాడు. దీంతో ఆ మహిళ తన ప్రియుడిని పెళ్లి చేసుకోగా, తన ఇద్దరు పిల్లలను మొదటి భర్తకు అప్పగించింది.