గురువారం, 28 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By JSK
Last Modified: శుక్రవారం, 18 నవంబరు 2016 (15:03 IST)

పెద్ద నోట్ల రద్దు ఓ సాహసం... బిల్‌గేట్స్ కూడా మెచ్చుకున్నారు...

న్యూఢిల్లీ : మ‌న దేశంలో ప‌రిస్థితులు ఎలా ఉన్నా... పెద్ద నోట్లను రద్దు చేస్తూ ప్రధాని నరేంద్రమోదీ తీసుకున్న నిర్ణయంపై విదేశీయులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. తాజాగా మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌ మోదీ నిర్ణయాన్ని‘సాహసం’గా అభివర్ణించారు. న

న్యూఢిల్లీ : మ‌న దేశంలో ప‌రిస్థితులు ఎలా ఉన్నా... పెద్ద నోట్లను రద్దు చేస్తూ ప్రధాని నరేంద్రమోదీ తీసుకున్న నిర్ణయంపై విదేశీయులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. తాజాగా మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌ మోదీ నిర్ణయాన్ని‘సాహసం’గా అభివర్ణించారు. నీతి ఆయోగ్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ఓ ఉపన్యాస కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. 
 
నోట్ల రద్దుతో డిజిటల్‌ లావాదేవీలు పెరుగుతాయని, దీనివల్ల పారదర్శకత ఏర్పడుతుందని అన్నారు. ‘రూ. 500, వెయ్యి నోట్లను రద్దు చేస్తూ మోదీ సాహసమైన నిర్ణయం తీసుకున్నారు. అంతేకాకుండా అత్యంత భద్రమైన ఫీచర్లతో కొత్త నోట్లను తీసుకొచ్చారు. భారత ఆర్థిక వ్యవస్థను వెన్నంటి ఉంటున్న ద్రవ్యోల్బణ తగ్గుదలకు ఇది ఉపకరిస్తుంది’ అని గేట్స్‌ అన్నారు