బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 22 జులై 2021 (08:08 IST)

5 పైసలకే బిర్యానీ..ఎక్కడ?

బిర్యానీ అంటే ఎగబడని వారు చాలా తక్కువగా ఉంటారు. కేవలం 5 పైసలకే బిర్యానీ అంటే... ఇక మామూలుగా ఉండదు కదా. ఈ జమానాలో 5 పైసలు ఎవరి దగ్గర ఉంటాయని భావిస్తున్నారా? ఆ హోటల్ యాజమాన్యం కూడా అదే రకంగా అనుకొని, ఈ ఆఫర్ ప్రకటించింది.

ఆఫర్ ప్రకటించిన కొద్ది గంటల్లో 5 పైసల నాణేలతో ప్రజలు ఎగబడ్డారు. దీంతో హోటల్ యాజమాన్యం బిత్తరపోయింది. వారి కళ్లు బైర్లు కమ్మాయి. ప్రజలు పెద్ద సంఖ్యలో 5 పైసల నాణేలతో వచ్చి నిలబడ్డారు. ఈ సంఘటన చెన్నైలో జరిగింది.

హోటల్ యాజమాన్యం సరదాకు ప్రకటించిందో, ఎవరూ రారని అనుకున్నారో,  కానీ సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది. దీంతో ఆ హోటల్ యాజమాన్యం దెబ్బకు షెటర్ వేసేసింది. అయినా... ప్రజలు అక్కడి నుంచి కదల్లేదు. అదీ విచిత్రం.